“వేణుమాధవ్” తో ఉన్న ఇతను ఎవరో గుర్తుపట్టారా.? తెలంగాణలో చాలా ఫేమస్.!

Ads

తీన్మార్ మల్లన్న గురించి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. ఒక ఛానల్లో తీన్మార్ వార్తలు కార్యక్రమం తో బాగా ఫేమస్ అయిన తర్వాత సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి రాజకీయానికి సంబంధించిన వీడియోలు చేస్తూ వైరల్ అయ్యారు. జర్నలిస్టుగా ఉంటునే రాజకీయాల్లో కూడా దిగారు.

అయితే ఇప్పుడు తీన్మార్ మల్లన్న సినిమాల్లో నటించారా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు వైరల్ అవుతుంది. తీన్మార్ మల్లన్న అంటే ఆసక్తి ఉండేదా? ఆయనకి నటన వచ్చా అంటే అవునునే చెప్పాలి….! తీన్మార్ మల్లన్న ఒక సినిమాలో చిన్న పాత్రలో నటించారు.తీన్మార్ మల్లన్న నటించిన ఏకైక సినిమా ఇది. సినిమా పేరు ‘శ్రీమతి బంగారం’. 2016లో వచ్చింది ఈ కామెడి సినిమా.

Ads

రాజీవ్ కనకాల, రిచర్డ్ రిషి, రిచా సిన్హా, తీన్మార్ మల్లన్న, వేణుమాధవ్, హేమ ప్రధాన పాత్రలు పోషించారు. ఎం. వినయ్ బాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నిజానికి ఈ సినిమా ఒకటి టాలీవుడ్‌లో వచ్చినట్టు చాలా మందికి తెలీదు. కాబట్టి ఇందులో తీన్మార్ మల్లన్న నటించారన్న సంగతి ఎవరికి తెలుస్తుంది. అందుకే, ఈ విషయం మరుగున పడిపోయింది. కానీ, మన సోషల్ మీడియా యోధులు దీన్ని బయటికి తీశారు. ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.

ఈ సినిమాలో వేణుమాధవ్, తీన్మార్ మల్లన్న స్నేహితులుగా నటించారు. వేణుమాధవ్‌కు హేమ భార్యగా నటించారు. తాగుబోతు భర్త అయిన వేణుమాధవ్‌ను భద్రకాళీలా భార్య హేమ క్రమశిక్షణలో పెడుతుంది. అలాంటి వాడికి మల్లన్న స్నేహితుడు. ఇద్దరూ కలిసి తాగుతుంటారు. ఈ క్రమంలో కామెడి పండించారు. అయితే, సోషల్ మీడియాలో తీన్మార్ మల్లన్న సినిమా సీన్స్ చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Previous article63 ఏళ్ల బాలకృష్ణ పక్కన…33 ఏళ్ల హీరోయిన్..! కూతురి లాగా ఉంటుంది ఏమో..!
Next articleNAA SAAMI RANGA: రీమేక్ లో “నాగార్జున” చేసిన మార్పులు ఇవే…ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు అంటే.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.