NAA SAAMI RANGA: రీమేక్ లో “నాగార్జున” చేసిన మార్పులు ఇవే…ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు అంటే.?

Ads

కింగ్ నాగార్జున‌ ‘నా సామిరంగ’ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 14న థియేటర్లలో సందడి చేయనుంది. కొరియోగ్రాఫ‌ర్ విజ‌య్ బిన్నీ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా తెలుగులో అడుగుపెడుతున్నారు.

జోజు జార్జ్ ప్రధాన పాత్రలో న‌టించిన‌ మ‌ల‌యాళ సినిమా ‘పురింజు మ‌రియం జోస్’ మూవీకి రీమేక్ గా తెలుగులో ‘నా సామిరంగ’ సినిమా తెర‌కెక్కుతోంది. 2019లో రిలీజ్ అయిన పురింజు మ‌రియం జోస్ సినిమా అత్య‌ధిక వ‌సూళ్ల‌ సాధించిన సినీమాగా ఆ ఏడాది నిలిచింది. ఆ సినిమాతో పోలిస్తే తెలుగులో ఎలాంటి మార్పులు చేర్పులు చేశారో ఇప్పుడు చూద్దాం..
అక్కినేని నాగార్జున‌ హీరోగా తెరకెక్కుతున్న నా సామిరంగ సినిమాలో హీరోయిన్‌గా ఆషికా రంగ‌నాథ్‌ నటిస్తోంది. అల్ల‌రి న‌రేష్, రాజ్‌త‌రుణ్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లలో నటిస్తున్నారు. ఈ మూవీ మలయాళ సూపర్ హిట్ మూవీ ‘పురింజు మ‌రియం జోస్’ రీమేక్ అనే విషయం తెలిసిందే. ఈ మూవీ  ఉండి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, పాటలు మూవీ పై అంచనాలను పెంచాయి. ఈ మలయాళ మూవీ రీమేక్ కి తెలుగు నెటీవీటికి తగినట్టుగా పలు మార్పులు చేసినట్టు తెలుస్తోంది.

Ads

మ‌ల‌యాళంలో జోజు జార్జ్ చేసిన క్యారెక్టర్ లో తెలుగులో కింగ్ నాగార్జున నటిస్తున్నాడు. మ‌ల‌యాళంలో జోజు జార్జ్ ఫ్రెండ్ గా చెంబ‌న్ వినోద్ జోస్ నటించారు. తెలుగులో ఈ పాత్రని అల్ల‌రి న‌రేష్ చేస్తున్నాడు.  నాగార్జున హెల్ప్ తో పెళ్లి చేసుకునే యువకుడిగా రాజ్ త‌రుణ్ నటిస్తున్నాడు. మ‌ల‌యాళం మూవీలో హీరోయిన్‌గా నైలా ఉష నటించింది. తెలుగులో ఆ పాత్రలో ఆషికా రంగ‌నాథ్ నటించింది.
పురింజు మ‌రియం జోస్ మూవీ సుమారు రూ. 20 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందింది. ఇక నాగార్జున నటిస్తున్న నా సామి రంగ‌ మూవీ బ‌డ్జెట్ ఇప్పటికే రూ. 50 కోట్లు దాటిన‌ట్లు తెలుస్తోంది. మలయాళ మూవీ జోజు జార్జ్‌, చెంబ‌న్ వినోద్ జోస్ మరణించడంతో ముగుస్తుంది. అయితే నా సామి రంగ‌ మూవీ క్లైమాక్స్ లో మార్పులు చేశారని తెలుస్తోంది. ఆస్కార్ విన్న‌ర్ కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి ఆడియెన్స్ ముందుకి రానుంది.

Also Read: ఇలాంటి కాన్సెప్ట్ మీద కూడా సినిమా తీస్తారా? ఓటీటీ లోకి వచ్చిన ఈ సినిమా చూశారా?

Previous article“వేణుమాధవ్” తో ఉన్న ఇతను ఎవరో గుర్తుపట్టారా.? తెలంగాణలో చాలా ఫేమస్.!
Next article“హిట్ అండ్ రన్” చట్టం అంటే ఏమిటి..? దేశవ్యాప్తంగా డ్రైవర్లు ఎందుకు ఆందోళన చేస్తున్నారు..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.