Ads
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టంను వ్యతిరేకిస్తూ లారీ, ట్రక్కు డ్రైవర్లు సోమవారం నుండి నాడు ఆందోళన చేపట్టారు. దీంతో దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. అత్యవసర సేవల్లో అంతరాయం ఏర్పడింది.
ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మె తో ఎక్కడికక్కడా పెట్రోల్ మరియు డీజిల్ సరఫరా ఆగిపోయింది. ఈ వార్త వైరల్ అవడంతో ఇంధన కొరత వస్తుందేమో అనే ఆందోళనతో ప్రజలు పెట్రోల్ బంకుల ముందుర పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. అసలు హిట్ అండ్ రన్ చట్టం ఏమిటో? ఎందుకు ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం..
ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ ”హిట్ అండ్ రన్” చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో హిట్ అండ్ రన్ కేసులలో కఠినమైన రూల్స్ ను చేర్చడంతో దేశంలో పలు ప్రాంతాలలో లారీ, ఆయిల్ ట్యాంకర్, ట్రక్కు డ్రైవర్లు ర్యాలీలు, రాస్తారోకోలు, ఆందోళనలకు దిగారు. దీంతో ఇంధన కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో పెట్రోల్ బంకులకు వాహనదారులు భారీగా క్యూ కట్టారు.
Ads
కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా బ్రిటీష్ కాలం నుండి ఉన్న ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్) ప్లేస్ లో “భారత న్యాయ సంహిత” పేరుతో క్రిమినల్ చట్టాన్ని కొత్తగా తీసుకువచ్చింది. ఇందులో ‘హిట్ అండ్ రన్’ కి పాల్పడే వారికి పడే శిక్షలను కఠినతరం చేశారు. ఈ చట్టం ప్రకారం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్ తో ఒకరి చావుకు కారణమయిన వ్యక్తికి ఏడు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తారు. డ్రైవింగ్ చేసిన వ్యక్తి ఒకరి మరణానికి కారణం అయ్యి, ఈ ఇన్సిడెంట్ గురించి లోకల్ పోలీసులకు, మెజిస్ట్రేట్‌కి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తప్పించుకుంటే జైలు శిక్ష గరిష్టంగా 10 సంవత్సరాలు పడే అవకాశం ఉంటుంది.
అది మాత్రమే కాకుండా ఏడు లక్షల వరకు జరిమానా పడుతుంది. కొత్త చట్టం ప్రకారం హిట్ అండ్ రన్ కేసులలో ఎక్కువ కాలం శిక్షతో పాటు, భారీ జరిమానాగా ఉండటంతో ట్రాక్ డ్రైవర్లు ఆందోళన పడుతున్నారు. ఈ చట్టం వల్ల శిక్ష పడితే 10 సంవత్సరాలు పాటు తమ ఫ్యామిలీకి దూరంగా ఉండాలని, అలా అయితే తమ ఫ్యామిలీ రోడ్డున పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏడు లక్షల జరిమానా గురించి మాట్లాడుతూ, అంత డబ్బు ఉంటే డ్రైవర్ గా ఎందుకు పనిచేస్తామని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు.
Also Read: ఎక్కువగా భూకంపాలు “జపాన్” లోనే ఎందుకు వస్తాయి..? కారణం ఇదేనా..?