Ads
ఎక్కడికైనా తేలికగా వెళ్లాలంటే చాలామంది ఎంచుకునే పబ్లిక్ వెహికిల్ ఆటో అని చెప్పవచ్చు. ప్రస్తుత రోజుల్లో ఉబర్, ఓలా, రాపిడో యాప్స్ ద్వారా ఆటోలు ఇంటి ముందుకే వస్తున్నాయి. అందువల్ల ఆటోలకి ఎక్కువ డిమాండ్ ఏర్పడింది.
Ads
ఎక్కడ చూసిన అవే కనిపిస్తుంటాయి. దాంతో సులభ ప్రయాణం కోసం ఎక్కువ శాతం ప్రజలు ఆటోల మీద ఆధారపడతారు. అయితే, చాలామంది ఎన్నోసార్లు ఆటోలలో ప్రయాణించి ఉంటారు. కానీ ఆటో డ్రైవర్ సైడ్ కి కూర్చుని ఉండడం గమనించరా? అలా సైడ్ కి ఎందుకు కూర్చుంటారో ఇప్పుడు చూద్దాం..
సాధారణంగా ఆటో నడిపేటపుడు డ్రైవర్లు తమ సీటులో రైట్ సైడ్ కు కూర్చుని ఉంటారు. దాదాపు అందరు ఆటో డ్రైవర్లు కూడా ఇలాగే కూర్చుని ఆటో డ్రైవ్ చేస్తుంటారు. ఎందుకిలా సైడ్ కి కూర్చుని డ్రైవ్ చేస్తారనే ఆలోచన ఒక ఆటోలో ప్రయాణించిన శివిన్ సక్సేనా అనే ప్రయాణికుడికి వచ్చింది. ఆ వ్యక్తి సుమారు 20 ఏళ్ళ పాటు ఆటోలలో జర్నీ చేసాడు. ఆ క్రమంలోనే అతనికి ఆటో డ్రైవర్లు కుడి వైపు అంచులో కూర్చుని ఎందుకు నడుపుతారు అనే సందేహం కలిగింది.
అలా సందేహం వచ్చిన వెంటనే అదే ప్రశ్నను ఒక ఆటో డ్రైవర్ ను అడిగాడు. అతన్నే కాకుండా ఆ వ్యక్తి ఇదే ప్రశ్నను చాలా మంది ఆటో డ్రైవర్లను కూడా అడిగాడు. అయితే ఆ ప్రశ్న అడుగానే అతన్ని చూసి ఎక్కువమంది డ్రైవర్లు నవ్వారట. కొందరు అలా కూర్చోవడానికి గల కారణాలను వెల్లడించారంట. సాధారణంగా ఆటో డ్రైవింగ్ నేర్చుకునే సమయంలో నేర్చుకునే వారి పక్కన నేర్పేవారు కూర్చుని, డ్రైవింగ్ నేర్పిస్తారు. ఆ విధంగా ఆటో డ్రైవర్ల కుడివైపుకు కూర్చుని డ్రైవ్ చేయడం అలవాటుగా మారుతుంది.
డ్రైవర్ కూర్చునే సీటు కింద ఇంజిన్ ఉంటుంది. అది ఆటో నడిపేటప్పుడు వేడిగా అవుతుంది. ఆ వేడి వల్ల డ్రైవర్లు తమ పొజిషన్ ను తరచుగా మార్చుకుంటూ సైడ్ కి కూర్చుంటారు. మరో కారణం ఏమిటంటే పక్కకి కూర్చోవడం వల్ల, ముందు సీటులో మరొకరిని ఎక్కించుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా ఎమర్జెన్సీ టైమ్ లో హారన్ కొట్టడం కోసం రైట్ సైడ్ కి కూర్చుంటారని తెలిపారు.
Also Read: Find “W”: మీ కంటి చూపు పదునుగా ఉందా…?అయితే ఇందులో W ఎక్కడుందో కనిపెట్టండి.. !