2023 లో రీ ఎంట్రీ ఇచ్చిన 10 మంది సీనియర్ హీరోయిన్లు వీరే..! లిస్ట్ లో ఎవరున్నారో చూడండి.!

Ads

గతంలో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నటీమణులు కొన్ని సినిమాలలో నటించిన తరువాత వారి వారి కారణాలతో ఇండస్ట్రీకి, సినిమాలకు దూరం అయ్యారు. అయితే ఆ హీరోయిన్లు గత ఏడాది టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చారు.

అలా రీఎంట్రీ ఇచ్చిన వారిలో ప్రముఖ హీరోయిన్లు, నటీమణులు కూడా ఉన్నారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ ను అందుకున్నారు. అలా గత ఏడాది రీఎంట్రీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్ లు, నటీమణులు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. మీరా జాస్మిన్ :
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా హిట్స్ అందుకున్న మీరా జాస్మిన్, విమానం మూవీతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ మూవీ నిరాశ పరిచింది.
2. రేణు దేశాయ్ :

సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.
3. సదా :

సీనియర్ హీరోయిన్ సదా దర్శకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన అహింస మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ద్వారా ప్రముఖ హీరో రానా సోదరుడు, నిర్మాత సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా మారాడు. ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత సదా నటించిన ఆదికేశవ సైతం ఫ్లాప్ అయ్యింది.
4. మమతా మోహన్ దాస్ :

అనారోగ్య కారణాలతో ఇండస్ట్రీకి దూరం అయిన మమతా మోహన్ దాస్ ‘రుద్రంగి’ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఆమె పాత్రకు మంచి పేరు వచ్చింది.
5. హనీ రోజ్ :

Ads

గతంలో హనీ రోజ్ ఆలయం, ఈ వర్షం సాక్షిగా లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. గత ఏడాది  ‘వీరసింహారెడ్డి’ మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలచింది. హనీ రోజ్ ఈ మూవీతో చాలా పాపులర్ అయ్యింది.
6. విమలా రామన్:

ఒకప్పుడు వరుస సినిమాలలో నటించిన విమలా రామన్ ‘రుద్రంగి’ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం పాజిటి టాక్ తెచ్చుకుంది.
7.  నేహా శర్మ:

రామ్ చరణ్ తొలిసినిమా చిరుతలో హీరోయిన్ గా నటించిన నేహా శర్మ, చాలా ఏళ్ల తరువాత ‘హాయ్ నాన్న’ మూవీతో రి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మూవీలో ఓ సీన్ లో మెరిసింది.
8. రిచా పన్నై:

అల్లరి నరేష్ హీరోగా వచ్చిన యముడికి మొగుడు మూవీలో  హీరోయిన్ గా నటించిన రిచా పన్నై, నీలకంఠ ‘సర్కిల్’ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది.
9. వనిత విజయ్ కుమార్ :

దేవి మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేసిన వనిత విజయ్ కుమార్, చాలా ఏళ్ల తరువాత ‘మళ్ళీ పెళ్లి’  మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.
10. వాసుకి ఆనంద్:

తొలి ప్రేమ మూవీలో పవన్ కళ్యాణ్ చెల్లెలి పాత్రలో నటించిన వాసుకి, సీరియల్స్ లో కూడా నటించారు.  ఆమె ‘అన్నీ మంచి శకునములే’ మూవీతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
Also Read: అప్పుడు మహేష్ కొడుకుగా, ఇప్పుడు మహేష్ కు పోటీగా అంటూ వస్తున్న వార్తల పై తేజ సజ్జ రియాక్షన్..!

 

Previous articleసలార్, డంకీ లాంటి పాన్ ఇండియా సినిమాలకే షాక్ ఇచ్చిన ఈ హీరో ఎవరో తెలుసా.? చెప్పిమరీ చేసారుగా.!
Next articleబాలరాముడి విగ్రహాన్ని చెక్కిన శిల్పి ఎవరో తెలుసా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.