సలార్, డంకీ లాంటి పాన్ ఇండియా సినిమాలకే షాక్ ఇచ్చిన ఈ హీరో ఎవరో తెలుసా.? చెప్పిమరీ చేసారుగా.!

Ads

డిసెంబర్ 22న విడుదలైన ప్రభాస్ సినిమా సలార్ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం 750 నుంచి 800 కోట్లకు చేరువలో ఉంది. అన్ని భాషల్లోని హిట్ టాక్ తో దూసుకుపోతున్న సలార్ కన్నడలో మాత్రం వెనుకబడింది.కన్నడలో డిసెంబర్ 29న కన్నడ సూపర్ స్టార్ దర్శన్ సినిమా కాటేరా రిలీజ్ అయింది.

అప్పట్లో సలార్ తో క్లాస్ విషయం మీద ది బాస్ కామెంట్లు చేశాడు సలార్ వస్తే రానివ్వండి దాన్ని చూసి మనం ఎందుకు భయపడాలి వాళ్ళే మనల్ని చూసి భయపడాలి ఇది మన ఏరియా అంటూ దర్శన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే సలార్ కన్నడలో వసూళ్లు పెద్దగా లేకపోవడానికి కారణం ప్రశాంత్ నీల్ తన ఫస్ట్ మూవీ ఉగ్రమ్ కి ఫ్రీ మేక్ అన్నట్లు సినిమా రిలీజ్ కి ఒక్కరోజు ముందు చెప్పాడు.

Ads

మిగిలిన భాషల వారికి ఉగ్రమ్ సినిమా గురించి తెలియదు కాబట్టి సలార్ ని కొత్తగా చూశారు ఆదే సినిమాని ఉగ్రం రూపంలో కన్నడ వాళ్ళు ఎప్పుడో చూసేసారు కాబట్టి అంతంత మాత్రమే వసూలు చేస్తుంది. దేశవ్యాప్తంగా డంకీ సినిమా ఇప్పటివరకు 410 కోట్లు వసూలు చేసిందని, సలార్ 650 కోట్లకు పైగా వసూలు చేసిందని లెక్కలు చెప్తున్నారు.

salaar vs dunki which is best trailer cut

అయితే కన్నడలో మాత్రం సలార్ ఇప్పటివరకు 35.7 కోట్లు వసూళ్లు సాధించగా డిసెంబర్ 29న వచ్చిన కాటేరా ఇప్పటివరకు 86.84 కోట్ల రూపాయలను రాబట్టి సంచలనం సృష్టిస్తుంది. ఇప్పుడు 100 కోట్ల క్లబ్లో చేరటానికి చాలా దగ్గరలో ఉంది. ఏదైనా కాటేరా సినిమా ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. కన్నడ సినిమాలకు తగిన ఫ్లాట్ ఫామ్ తయారైందని కాటేరా, కాంతారా వంటి సినిమాలు రుజువు చేస్తున్నాయి.

Previous article“అవికా గోర్” నటించిన ఈ పల్లెటూరి ప్రేమకథ ఎలా ఉంది.? స్టోరీ ఏంటి.?
Next article2023 లో రీ ఎంట్రీ ఇచ్చిన 10 మంది సీనియర్ హీరోయిన్లు వీరే..! లిస్ట్ లో ఎవరున్నారో చూడండి.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.