Ads
బిగ్ బాస్ సీజన్ 7 పాల్గొని, వార్తల్లో నిలిచిన కంటెస్టెంట్, నటుడు శివాజీ లేటెస్ట్ గా నటించిన వెబ్ సిరీస్ 90’ స్. ఈ సిరీస్ క్యాప్షన్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. ఈ సిరీస్ లో ‘తొలి ప్రేమ’ మూవీలో పవన్ కల్యాణ్ సిస్టర్ గా పాపులర్ అయిన వాసుకీ కూడా నటించారు. నేడు ఓటీటీలో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
- వెబ్ సిరీస్: 90’స్. ఏ మిడిల్ క్లాస్ బయోపిక్
- నటీనటులు: శివాజీ, వాసుకీ ఆనంద్ సాయి, మౌళి తనూజ్ ప్రశాంత్, వాసంతిక, రోహన్ రాయ్, తదితరులు..
- డైరక్టర్: ఆదిత్య హాసన్
- నిర్మాతలు: నవీన్ మేడారం, రాజశేఖర్ మేడారం
- మ్యూజిక్: సురేశ్ బొబ్బలి
- రిలీజ్ డేట్: 05/01/2023
కథ:
చంద్రశేఖర్ (శివాజీ), రాణి (వాసుకీ ఆనంద్ సాయి) ఇద్దరు భార్య భర్తలు. వీరిది మధ్యతరగతికి చెందిన కుటుంబం. ఈ జంటకి ముగ్గురు సంతానం. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. పెద్ద అబ్బాయి పేరు రఘు (మౌళి తనూజ్ ప్రశాంత్), చిన్నవాడి పేరు ఆదిత్య (రోహన్ రాయ్), కుమార్తె పేరు దివ్య (వాసంతిక). చంద్రశేఖర్ ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టారు.
తన పిల్లలను మాత్రం ప్రైవేట్ స్కూల్లో చేరుస్తాడు. ఆదిత్య డల్ స్టూడెంట్ కాగా, దివ్య, రఘు బాగా చదువుతారు. ఈ క్రమంలో రఘు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తాడని ఆశిస్తారు. వారి ఫ్యామిలీ అనుకున్నట్టుగా రఘుకి ర్యాంక్ వచ్చిందా? రఘుకి అతని క్లాస్మేట్ సుచిత్ర (స్నేహాల్ కామత్)కి మధ్య ఏం జరిగింది? మధ్యతరగతి కుటుంబంలోని పెద్దలు మరియు పిల్లల ఆలోచనలు ఎలా ఉంటాయనేది మిగిలోన కథ.
విశ్లేషణ:
Ads
స్మార్ట్ ఫోన్ అందుబాటులోని 90లలోని మధ్యతరగతి కుటుంబం గురించిన కథే ఈ వెబ్ సిరీస్. అలా అని ఇందులో ”మిడిల్ క్లాస్ జీవితాలలో ఉండే పెద్ద కష్టాలు, కాన్ఫ్లిక్ట్స్ లాంటివి ఉండవు. పెద్ద స్టోరీ కూడా కాదు. చాలా సింపుల్ కథ. 90 లలో ఉండే మిడిల్ క్లాస్ జీవితాన్ని ఈ వెబ్ సిరీస్ లో దర్శకుడు ఆవిష్కరించారు.
ఈ వెబ్ సిరీస్ మొదట్లోనే ఓ డైలాగ్ వినిపిస్తుంది. ఆ డైలాగ్ వలె ఈ సిరీస్ మిడిల్ క్లాస్ వారి అనుభవాలు, జ్ఞాపకాలు. అని డైలాగ్ వినబడుతుంది. ఇది ఎన్నో మధ్యతరగతి జీవితాల్లో జరిగిన కథ. ఆ కుటుంబాల్లో తమ పిల్లల ఫ్యూచర్ కోసం ఆలోచించే పేరెంట్స్, తమకు నచ్చినవి చేయాలనుకునే వారి పిల్లలు, పాఠశాలలో ఏర్పడే ప్రేమల వంటివాటిని ఈ సిరీస్ లో డైరెక్టర్ అందంగా తెరకెక్కించారు.సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం, సీన్స్ కి ఆడియెన్స్ మరింత కనెక్ట్ అయ్యే విధంగా చేసింది. ఈ సిరీస్ కొన్ని చోట్ల నవ్విస్తుంది, కంటతడి కూడా పెట్టిస్తుంది. నాన్న చేతిలో చిన్నప్పుడు తిన్న దెబ్బలను గుర్తుకు తెస్తుంది. మధ్యతరగతి అమ్మ కష్టాన్ని చూపిస్తుంది. 90లల సమయంలో పిల్లలుగా ఉన్నవారిని ఒక్కసారి వారి చిన్నతనంలోకి తీసుకుకెళ్తుంది.
నటీనటుల విషయానికి వస్తే, శివాజీ చంద్రశేఖర్ పాత్రలో ఒదిగిపోయారు. చాలా నేచురల్ గా నటించారు. మధ్య తరగతి ఇల్లాలు రాణిగా వాసుకి ఆకట్టుకున్నారు. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లో గుర్తుండిపోయే పాత్ర. వారి పిలల్లు గా నటించిన మౌళి,రోహన్, వాసంతిక చక్కగా నటించారు.
ప్లస్ పాయింట్స్:
- శివాజీ, వాసుకి నటన,
- ఎంచుకున్న స్టోరీ
- నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్:
- ఈ సిరీస్ లో చెప్పడానికి అంతగా మైనస్ పాయింట్స్ లేవు. కొన్ని సీన్స్
రేటింగ్:
3/5
చివరి మాట:
చిన్న చిన్న వాటిల్లో ఆనందం వెతుక్కునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ వెబ్ సిరీస్ ఆకట్టుకుంటుంది. కుటుంబం అంతా కలిసి చూడగలిగే వెబ్ సిరీస్..
watch trailer :
Also Read: Dhootha Web Series Review: నాగ చైతన్య “దూత” వెబ్ సిరీస్ ఎలా ఉంది.? స్టోరీ, రివ్యూ & రేటింగ్!