Ads
కాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన కొత్త బంగారులోకం సినిమా 2008లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ హీరీహిరోయిన్స్ గా నటించారు. అప్పుడే కాలేజీలో చేరిన యువత తొలి చూపులోనే ప్రేమలో పడి,సమస్యలలో ఇరుక్కుని, చివరకు లక్ష్యాన్ని చేరుకున్న తరువాతే కలుసుకోవాడమే ఈ సినిమా కథ.
Ads
ఈ సినిమా అప్పట్లో చాలాపెద్ద హిట్. యువత మనసులను గిలిగింతలు పెట్టేంతగా , అందమైన ప్రేమకథగా తెరకెక్కించారు. ఈ మూవీకి ప్రధాన ఆకర్షణ పాటలు అనే చెప్పాలి.ఈ సినిమాకి సంగీతం మిక్కీ జే మేయర్ అందించారు. ఒక్కో సాంగ్ ని ఒక్కో ఆణిముత్యం అనవచ్చు. కాలేజీ నేపథ్యంలోనే ప్రేమను,విరహాన్ని, బాధను, వివరిస్తూ వచ్చిన ఈ సాంగ్స్ ఆరోజుల్లో అన్ని కాలేజీలలో వినిపించాయి.
కానీ ఇంత ఆదరణ పొందిన ‘కొత్త బంగారులోకం’ సినిమాలో ఒక పెద్ద తప్పు ఉంది. ఆ తప్పు ఏంటి అనేది తెలుసా? ఎన్నో సార్లు ఈ సినిమాను చూసినా, ఇప్పటికి కూడా ఆ మిస్టెక్ ని ఎవరూ గుర్తించలేదనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ప్రేమలో పడి, లేచిపోవడానికి కూడా ప్రయత్నిస్తారు. సరిగ్గా ఆ సమయంలో హీరో వరుణ్ సందేశ్ తండ్రి హఠాత్తుగా మరణించడంతో, ఆ ప్రయత్నాన్ని పక్కన పెట్టి, తన అమ్మతోనే ఉంటూ చదువును కంప్లీట్ చేస్తాడు. ఈ క్రమంలో లేచిపోవడానికి బయటకు వచ్చిన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ ను వదిలేస్తాడు.
అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో హీరోయిన్ తండ్రి ఎదురై ఎలా ఉన్నావ్? ఏం చేస్తున్నావ్? అని హీరో వరుణ్ సందేశ్ ను అడిగినపుడు అతను ‘ఇంజినీరింగ్ అయిపోయింది అంకుల్’ అని చెప్తాడు. వాస్తవానికి హీరో వరుణ్ ఇంటర్ లో చదివింది బైపీసీ. సినిమాలో ప్రయోగశాలలో ప్రయోగాలు చేస్తూ కూడా కనిపిస్తాడు. కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఇంజినీరింగ్ పట్టా అందుకున్నట్టుగా చూపించారు. ఇది ఒక బ్లండర్ మిస్టేక్.
దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో సెటైర్లు, ట్రోల్స్ వేస్తున్నారు. బైపీసీ చదివి ఇంజినీర్ పాస్ అవ్వడం మామూలు విషయం కాదంటూ మీమ్స్ నెట్టింట్లో షికారు చేస్తున్నాయి. ఏది ఏమైనా ఒక సినిమాను తీసేప్పుడు మిస్టేక్స్ చేస్తే అవి చిన్నవి అయినా, పెద్దవి అయినా కొంచెం చూసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇలా నెటిజన్లు ఆడుకోవడం ఖాయం.
Also Read:హన్సిక లాగే విడాకులు తీసుకున్న వారిని పెళ్లి చేసుకున్న10 మంది స్టార్ హీరోయిన్లు..!