Ads
భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబం అంబానీ ల గురించి పరిచయం అక్కరలేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ తో భారతదేశ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. ధీరుభాయ్ అంబానీ నుంచి వారసత్వం పొందిన ముఖేష్ అంబానీ రూ.841627 కోట్ల నికర విలువతో అత్యంత ధనవంతులలో ఒకరిగా కొనసాగుతున్నారు. ముఖేష్ తరహాలోనే ఆయన పిల్లలు ఆకాష్, ఇషా, అనంత్ కూడా రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంలో చేరారు.
తండ్రికి తగ్గట్టుగానే పిల్లలు కూడా రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంలోను విజయవంతంగా నడిపించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. జియో విజయవంతం అవడం వెనకాల తన పిల్లల కృషి ఎంతో ఉందని పలుమార్లు ముఖేష్ అంబానీ చెప్పారు.
Ads
తమ పిల్లల వ్యాపార దక్షతే కాదు వారి ప్రవర్తన కూడా చాలా హుందాగా ఉంటుందని ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.అయితే గతంలో జరిగిన ఒక సంఘటనను ఆమె పంచుకున్నారు. “ఆకాష్ ఒకసారి మా వాచ్‌మెన్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. కొన్ని కారణాల వల్ల ఆకాష్ తన స్వరాన్ని పెంచి వాచ్‌మెన్‌పై కేకలు వేస్తున్నాడు. ఆకాష్ అలా చేయడం ముఖేష్ విన్నారు. ఆకాష్‌ను మందలించి వెంటనే కిందకు వెళ్లి వాచ్‌మెన్‌కు సారీ చెప్పాలని అన్నారని” నీతా చెప్పారు.
వెంటనే కిందకి వెళ్లి ఆకాష్ వాచ్ మెన్ కి సారీ చెప్పాడని, అది అతను మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా మారడానికి చాలా దోహద పడిందని చెప్పుకొచ్చారు. అయితే అంబానీ కుటుంబం సేవా కార్యక్రమాలు కూడా చాలా మంచి హృదయంతో చేస్తూ ఉంటారు. తమ పిల్లల పెళ్లిళ్లకి, పుట్టినరోజు అప్పుడు పేదవారిని పిలిచి భోజనాలు పెట్టడం వారికి బహుమతులు అందించడం వంటివి మనం చూస్తూనే ఉంటాం