Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలను ట్రోలింగ్ చేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. వారు చెప్పే డైలాగులు లేదంటే ఏదైనా సీన్లు మాటలను పట్టుకుని ట్రోలింగ్స్ చేస్తూ ఉంటారు. పలువురైతే హీరో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అంటూ హితవు పలుకుతూ ఉంటారు కూడా.
తాజాగా గుంటూరు కారం సినిమా నుండి కుర్చీ మడత పెట్టి సాంగ్ విడుదలైంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక డైలాగులు తీసుకుని ఈ పాటలో పెట్టారు.
సోషల్ మీడియాలో ఉన్న డైలాగ్ కొద్దిగా బూతులతో కూడి ఉంటుంది. అయితే సినిమాలో కేవలం బూతులు లేకుండా మాటలు మాత్రమే తీసుకుని వాడారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండే చాలామంది మహేష్ బాబు లాంటి వ్యక్తి ఇలాంటి మాటలను పాటల్లో ఎలా పెడతారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని త్రివిక్రమ్ కూడా ఇలా చేయకూడదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే క్రిందటి సంవత్సరం సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక పాట పాడారు.
Ads
ఒక సందర్భంలో జంబలకడి జారు మిఠాయి అంటూ ఒక సోషల్ మీడియాలో వైరల్ అయిన పాటను పాడారు. ఈ పాట కూడా కొంచెం పదాలన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మెగాస్టార్ లాంటి వ్యక్తి ఆ పాటను పాడితే తప్పు లేదు గాని సూపర్ స్టార్ మహేష్ బాబు కుర్చీ మడత పెట్టి సాంగ్ చేస్తే తప్పు వచ్చిందా అంటూ పలువురు కంపేరిజన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే హీరోలు ఏం చేసినా కూడా ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకునే చేస్తారు. ఫ్యాన్స్ ను అలరించాలని కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు తప్ప వారికి వేరే ఉద్దేశం ఉండదని తెలుసుకోవాలి.