Ads
ఇండియన్ టీం లోని ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ప్రస్తుతం బీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు. వరల్డ్ కప్ లో షమీ ప్రదర్శన చూసిన ఎవరైనా సరే దాసోహం అవ్వాల్సిందే. బెంచికే పరిమితమైన షమీ వచ్చిన అవకాశాన్ని అందుపుచ్చుకొని జట్టులో స్టార్ బౌలర్ గా మారిపోయాడు. తన భార్యతో జరిగిన వివాదాలు కారణంగా కొంత మనస్థాపానికి లోనై మళ్ళీ తిరిగి పుంజుకుని ఫామ్ లోకి వచ్చాడు.
అయితే మహమ్మద్ షమీ లవ్ స్టోరీ గురించి ఎవరికీ తెలియకపోవచ్చు. మహమ్మద్ షమీ తన భార్య హసిన్ జహాన్ లవ్ స్టోరీ 2012లో మొదలైంది. 2012లో షమీ కోల్ కత్తా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్ ఆడేవాడు. షమీ భార్య కోల్ కత్తా తరపున చీర్ గర్ల్ గా పని చేసేది.
Ads
షమీకి ఆమెను చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలిగింది. వెంటనే ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాడు. తర్వాత ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ గా మారి, ఒకరి ప్రేమను ఒకరు చెప్పుకుని కొద్ది రోజులు డేటింగ్ చేశారు. తర్వాత ఇరు కుటుంబ సభ్యులకు తమ ప్రేమను చెప్పి వారి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. జూన్ 6 2014లో వీరి పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత షమీ భార్య మోడలింగ్ మానేసింది. 2017 జూలైలో షమీకి హాసిన్ కు ఒక పాప పుట్టింది. తర్వాత కొద్ది రోజులకు షమీ భార్య అతనిపైన ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది.
షమీ వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడని తనని వేధిస్తున్నాడని కేసు పెట్టింది. ఫిక్సింగ్ ఆరోపణలు కూడా చేసింది. అయితే విచారణలు అన్ని ఎదుర్కొన్న షమీ నిర్దోషిగా బయటకు వచ్చాడు. అయితే కోర్టు మాత్రం అతని భార్యకు నెలకి 1 లక్ష 30000 రూపాయలు భరణం అందించాలని తీర్పు చెప్పింది. తాజాగా షమీ ఆటపైన ఫోకస్ చేసి అద్భుతంగా రాణిస్తున్నాడు. వరల్డ్ కప్ లో షమీ ఆటకు గాను భారత ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది కూడా