Ads
సంక్రాంతి కానుకగా వస్తున్న మూవీలో మొదటిగా విడుదలైంది హనుమాన్.ప్రముఖ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ విడుదలైంది.
అయితే ఈ మూవీ మొదటి షో నుండి కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కథ విషయంలో గాని, యాక్టింగ్ విషయంలో కానీ, విఎఫ్ఎక్స్ క్వాలిటీ విషయంలో కానీ మంచి క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చారంటూ ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అయ్యారు.
అయితే ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల సమస్య వచ్చినా కూడా కథ మీద నమ్మకంతో మేకర్స్ ఈ సినిమాకి లాంగ్ రన్ ఉంటుందని నమ్మి విడుదల చేశారు. ఇప్పుడు అదే నిజమైంది. క్లైమాక్స్ అరగంట కూడా ఈ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టింది అంటూ ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేశారు. థియేటర్లలో లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు.సంగీతం కానీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గాని,కెమెరా వర్క్ ఇలా అన్ని హనుమాన్ మూవీకి బాగా కలిసి వచ్చాయి. ఇన్ని బాగున్నా కూడా హనుమాన్ కి ఒక విషయంలో మైనస్ గా చెబుతున్నారు.
Ads
అదేంటంటే ఎమోషనల్ సీన్స్ సరిగ్గా కనెక్ట్ అవ్వలేదని కొంతమంది ఫీలింగ్. సిస్టర్ సెంటిమెంట్ గాని ఆమె చనిపోయేటప్పుడు వచ్చే ఎమోషనల్ సీన్స్ గాని అంతగా కనెక్ట్ అవ్వలేదు అలాగే కొన్నిచోట్ల లాజిక్ ని పట్టించుకోకుండా సీన్స్ ఉండడం మైనస్ గా చెప్పవచ్చు. అయితే హనుమాన్ లో ఉన్న క్వాలిటీ అండ్ కంటెంట్ విషయంతో పోలిస్తే ఈ మైనస్ లు పెద్ద లెక్క కాదు. నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. 100 కోట్లు సాధించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అని కామెంట్స్ వస్తున్నాయి