ఫ్యాన్స్ కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో విజయ్..! ఇలా అయిపోయారేంటి..?

Ads

దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ ఇండియాలో ఆయనకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆయన లియో సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాగా ఈ సినిమా మంచి విజయం నమోదు చేసుకుంది ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ వెంకట ప్రభువు డైరెక్షన్ లో ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమాలో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఇందులో జయరాం, ప్రభుదేవా, మోహన్‌, ప్రశాంత్‌, వైభవ్‌, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి తదితరులు నటిస్తున్నారు. యువన్‌శంకర్‌ రాజా సంగీతం. ఏజీఎస్‌ బ్యానరుపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో పాటు పలు ప్రాంతాల్లో జరుగుతోంది.

Ads


తాజాగా ఆయన ఒక సరికొత్త గెటప్ లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా షూటింగ్ లొకేషన్ లో ఫ్యాన్స్ తో కలిసి సెల్ఫీ దిగి అది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో చూసిన ఆయన ఫ్యాన్స్ అందరు షాక్ అయిపోతున్నారు. ఏంటి ఇది విజయ్ ఫోటో నా అంటూ ఆశ్చర్యానికి గురయ్యారు. ముందు ఈ ఫోటో ఎవరిదో విజయ్ డుప్ ది అనుకున్నారు.

what happened to vijay

అయితే తర్వాత మేకర్స్ అఫీషియల్ గా విడుదల చేసిన తర్వాత అప్పుడు నమ్మారు. ఏదేమైనా విజయ్ ఆయన ఫాన్స్ కి చిన్నపాటి షాక్ ఇచ్చారనే చెప్పాలి.ప్రతి సినిమాకి విజయ్ ఎంతో డెడికేషన్ తో పనిచేస్తారు ప్రస్తుతం నటిస్తున్న సినిమాలో గెటప్ కోసం మీసాల సైతం తీసేసి సినిమా పట్ల ఆయన డెడికేషన్ మరోసారి చాటుకున్నారు.

Previous articleధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమా చూశారా..? ఎలా ఉందంటే..!
Next articleSAINDHAV REVIEW : “వెంకటేష్” నటించిన ఈ సినిమా అలరించిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.