జై హనుమాన్ కన్నా ముందే..మరో సూపర్ హీరో మూవీతో రాబోతున్న ప్రశాంత్ వర్మ!

Ads

ఎన్నో అవంతరాలను దాటుకొని పెద్ద సినిమాలకి పోటీగా నిలబడి విజయాన్ని సాధించింది హనుమాన్ సినిమా. దీంతో ఆ సినిమా డైరెక్టర్ అయినా ప్రశాంత్ వర్మ పేరు పాన్ ఇండియా లెవెల్లో మారుమోగిపోతుంది.( PVCU) ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో తొలి చిత్రం హనుమాన్. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో pvcu లో తర్వాత రాబోయే సినిమా ఏమిటా అంటూ అందరూ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు.

అయితే హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ వస్తుందని సినిమా ఆఖరిలో మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ సినిమా కన్నా ముందే మరొక సూపర్ హీరో సినిమాతో మన ముందుకి రాబోతున్నారు ప్రశాంత్ వర్మ ఆ సినిమా పేరు అధీర. ఈ సినిమా తో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య కుమారుడు దాసరి కళ్యాణ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో హీరోకు కరెంట్ షాక్ లాంటి అతీత శక్తి ఉంటుంది బ్లాక్ సూపర్ హీరో డ్రస్సులో అధీర లుక్ అదిరిపోయింది.

Ads

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ స్ట్రైక్ గ్లిప్స్ గత ఏడాదిలోనే వచ్చింది. ఇందులో చివర్లో చూపించే వజ్రాయుధం లాంటిది కూడా చాలా ఇంట్రెస్ట్ ని పెంచేసింది. ఈ సినిమాని ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేయాలని ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నారు. హనుమాన్ సినిమాని నిర్మించిన నిరంజన్ రెడ్డి ఈ అధీర సినిమాని కూడా నిర్మిస్తున్నారు. హనుమాన్ సినిమాకి బిజిఎం ఇచ్చిన గౌరీ హరి, మ్యూజిక్ డైరెక్టర్ శివేంద్ర దాశరధి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఈ సినిమా తర్వాత జై హనుమాన్ షూటింగ్ ప్రారంభించి 2025 లో రిలీజ్ చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు టాలెంటెడ్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమా ఎలాగూ సక్సెస్ అయిపోయింది కాబట్టి ఇకమీదట అధీరా మూవీ మేకింగ్ లో బిజీ అయిపోతారు ప్రశాంత్ వర్మ ఇక అప్పటినుంచి మనకి అధీరా సినిమా గురించిన అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Previous articleSAINDHAV REVIEW : “వెంకటేష్” నటించిన ఈ సినిమా అలరించిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్!
Next articlePrajapalana : తెలంగాణ ప్రజలకు శుభవార్త..! ఇలా చేస్తే 200 యూనిట్ల కరెంటు ఉచితం..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.