Ads
తమిళ్ హీరో శివకార్తికేయన్ నటించిన తాజా చిత్రం ఆయలాన్. సై ఫై జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా విడుదలైంది. తమిళ్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం తెలుగులో విడుదల వాయిదా వేసుకుంది. అయితే ఆయలాన్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందాం లేదా అనేది చూద్దాం.
ఈ ప్లానెట్ ను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నా ఒక ఇండస్ట్రీ లిస్ట్ ను అడ్డుకోవడానికి ఒక ఏలియన్ ఒక కుర్రాడితో జట్టు కట్టి దాన్ని ఎలా ఆపింది అనేది ఈ కథ ప్రధాన అంశం.
ఇక ఈ చిత్రం రివ్యూ విషయానికి వస్తే డైరెక్టర్ రవికుమార్ ఈ సినిమాకి లోకల్ టచ్ ఇచ్చి తెరకెక్కించాడు. ఏలియన్ బ్యాక్ డ్రాప్ తీసుకుని కంప్లీట్ తమిళ్ మూవీ లా దీన్ని ప్రజెంట్ చేశారు. ఒక తమిళ్ సినిమాకి ఉండాల్సిన కమర్షియల్ హంగులన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ చిత్రంలో క్లైమాక్స్ 2015 టైం లో వచ్చిన పాత సినిమాల నేపథ్యంలో ఉన్నట్టు ఉంటుంది. ఆ సమయానికి ఇది ప్రీ ప్రొడక్షన్లో ఉండడం కారణం చేత ఆ ఫ్లేవర్ ఈ సినిమాకి వచ్చింది. అయితే అది చిత్రానికి ఏమాత్రం అడ్డంకిగా మారలేదు.
Ads
ఈ చిత్రం ఎక్కువగా ఈ ప్లానెట్ ను ఎలా కాపాడాలి అనే దాని చుట్టూరానే తిరుగుతుంది. డైరెక్టర్ రవికుమార్ ఈ చిత్రాన్ని పలు హాలీవుడ్ మూవీల ఇన్స్పిరేషన్ తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. టట్టో అనే ఏలియన్ క్యారెక్టర్ ద్వారా ఫన్ జనరేట్ చేయడంలో సినిమా టీం బాగా సక్సెస్ అయ్యింది. విఎఫ్ఎక్స్ పోర్సన్స్ కూడా కొన్ని చోట్ల బాగుండగా.. మరికొన్ని చోట్ల తేలిపోయాయి. విలన్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు.
అతనికి ఇచ్చిన ఎలివేషన్ కి ,తన ప్రజెంటేషన్ కి సంబంధం లేదు. సినిమా క్లైమాక్స్ మరింత ఆసక్తికరంగా ఉండుంటే బాగుండేది. ఏ ఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాకి తగ్గట్టుగా ఉంది. శివ కార్తికేయన్ నటన ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే ఎనర్జిటిక్ గా ఉంది. అయితే ఈ సినిమా పిల్లలు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. అన్ని సెక్టార్ ఆడియన్స్ కి నచ్చుతుందో లేదో చెప్పలేం…ముఖ్యంగా ప్లానెట్ ను కాపాడాలి అనే కోరే థీమ్ మాత్రం బాగా వర్కౌట్ అయింది. ఫైనల్ గా… సై ఫై జోనర్లు ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. ఏలియన్స్ చేసిన ఎంటర్టైన్మెంట్ కోసం ఈ సినిమాని ఒక్కసారి చూడవచ్చు