Ads
సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ మూవీకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. తెలుగులో విడుదలైన సంక్రాంతి సినిమాల్లో మొదటి హిట్ కొట్టిన సినిమాగా నిలిచింది.
సినిమా రిలీజ్ కి ముందు మహేష్ బాబు గుంటూరు కారంతో ఈ సినిమాకి పోటీ ఎందుకో అని అన్నారు. అయితే సినిమా విడుదలైన తర్వాత ఇక్కడ పరిస్థితి మారిపోయింది. గుంటూరు కారం సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. గుంటూరు కారంతో పోలిస్తే హనుమాన్ సినిమా మంచి క్వాలిటీగా కంటెంట్ తో ఉంది అని విశ్లేషకులు అంటున్నారు. హనుమాన్ సినిమాకి సీక్వెల్ ప్రకటించి జై హనుమాన్ అనే టైటిల్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అందరూ ఆడియన్స్ కూడా హనుమాన్ సినిమా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు.
Ads
అయితే తెలుగులో ఈ సినిమాకి సరైన థియేటర్ లు ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు. అయితే సినిమా టాక్ బాగుండడంతో ఈరోజు నుంచి ధియేటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తాజాగా హనుమాన్ సినిమాకి సంబంధించిన రెమ్యూనరేషన్ విషయాలు బయటకు వచ్చాయి. సినిమా బడ్జెట్ అంతా కలిపి 55 కోట్లు అయిందంట. 55 కోట్లకు ఈ రేంజ్ అవుట్ పుట్ ఇస్తే ఇంకా బడ్జెట్ పెంచి ఉంటే ఏ రేంజ్ అవుట్ పుట్ వచ్చేదో అని పలువురు అంటున్నారు.
అయితే ఈ సినిమాకి పనిచేసిన మరి రెమ్యూనిరేషన్ విషయాలు కూడా తాజాగా బయటకు వచ్చాయి. ఈ సినిమాకి గాను హీరో తేజ సజ్జా కి రెండు కొట్లు రూపాయలు ఇచ్చారంట. ఇక డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కి కోటి రూపాయలు ఇచ్చారట. ఇందులో హీరోయిన్గా నటించిన అమృత అయ్యార్ కు1.5 కోట్లు, వరలక్ష్మి శరత్ కుమార్ కి కోటి రూపాయలు, వినయ్ రాయ్ కి 65 లక్షలు, వెన్నెల కిషోర్ కి 55లక్షలు, గెటప్ శ్రీనుకి 35 లక్షల వరకు రెమ్యూనిరేషన్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది