Ads
సంక్రాంతి కానుకగా విడుదలైన మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.సినిమా విడుదలైన రోజు కావాలని కొందరు నెగిటివ్ టాక్ ప్రచారం చేసినా కూడా ఆ ఎఫెక్ట్ కలెక్షన్లపై ఎక్కడా కనిపించలేదు.
ఫస్ట్ డే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 94 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లుగా మేకర్స్ అఫీషియల్ గా విడుదల చేశారు. ప్రీమియర్ షోల కలెక్షన్స్ తో కలిపి టోటల్ కలెక్షన్స్ ప్రకటించారు. దీంతో మహేష్ బాబు స్టామినా ఏంటో తెలిసింది అంటూ ఆయన అభిమానులు సంబరపడిపోతున్నారు.
Ads
వాస్తవానికి గుంటూరు కారం సినిమాకి మొదటి రోజు సోషల్ మీడియాలో భారీగా నెగిటివ్ ప్రచారం చేశారు. కొందరు ఈ సినిమాని అజ్ఞాతవాసితో పోల్చారు. అయితే అజ్ఞాతవాసి సినిమా ఫస్ట్ టాక్ అనంతరం భారీగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. కానీ గుంటూరు కారం సినిమా మాత్రం కలెక్షన్ల విషయంలో ఎక్కడ డ్రాప్ అవ్వకుండా దూసుకెళుతోంది. ఒకపక్క హనుమాన్, సైంధవ్ సినిమాల పోటీ ఉన్న కూడా గుంటూరు కారం తన కెపాసిటీని చూపిస్తుంది. ఇక రెండో రోజు కూడా ఈ సినిమా భారీగానే కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేటర్ల చాలా బాగుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ సినిమాకి మొత్తం 200 కోట్ల బడ్జెట్ అయిందని అంటున్నారు. ఇదే జోరు కొనసాగితే బ్రేక్ ఈవెన్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు