Ads
మూడు రోజులపాటు అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగలో మూడవరోజు కనుమ పండుగ జరుపుకుంటాము. కనుమను పశువుల పండుగ అంటారు. రైతులు తమ చేతికి వచ్చిన పంట కేవలం తమ శ్రమతోనే రాలేదని ఇందులో పసుపులకు భాగం ఉందని విశ్వసిస్తారు. అందుకే పంటల అభివృద్ధి జరిగిందనడానికి గుర్తుగా కనుమ పండుగను వైభవంగా జరుపుకుంటారు.
ఈరోజు పశువులకు పక్షులకు ఆహారం అందిస్తారు. గోవులకు పసుపు కుంకుమలు పెట్టి పూజిస్తారు తద్వారా ఆరోజు అవి సంతోషంగా ఉండేలా చూస్తారు. కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదంటారు. కనుమ రోజు పొద్దున్నే పశువులను పూజించడం, మధ్యాహ్నం పితృదేవతలకు తర్పణాలు వదలడం చేస్తారు.కొన్ని ఊరిలో కనుమ రోజు గ్రామదేవతల ఆలయాల వద్ద బలులు ఇవ్వడం, పొంగళ్ళు వండడం కూడా చేస్తారు.
Ads
మూడు రోజులు పండుగలో మూడో రోజు కూడా చాలా ముఖ్యమైనది. ఇంత హడావిడిగా ఉంటుంది కాబట్టి కనుమ రోజు కాకి కూడా కదలదు అని అనేవారు పెద్దలు. కాదు, కూడదని ఆ రోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని అంటారు. ఏడాదిలో మూడు రోజులు పాటు సంబరంగా జరుపుకునే ఈ పండుగ రోజు అంతా కలిసి ఉండాలని ఉద్దేశంతో అలా చెప్పారు.కానీ ప్రయాణం చేస్తే ఏదో జరిగిపోతుందని భావన అవసరం లేదంటారు మరికొందరు.
ఇంకొందరు ముక్కనుమ రోజు కూడా ప్రయాణం చేయకూడదు అంటారు. వాస్తవానికి ముక్కనుమ అనేది ఈ మధ్య మొదలైన సంప్రదాయం. సంక్రాంతికి ముందు రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ పశువుల పండుగ. ఇలా కనుమతోనే సంక్రాంతి సంప్రదాయాలని పూర్తవుతాయి. అందుకనే శాస్త్రం ప్రకారం అసలు ముక్కనుమేలేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో నాలుగో రోజున గ్రామదేవతలకు బలిచ్చి మాంసాహారం వండుకొని తినే సంప్రదాయం ఉంది. అందుకే ఈరోజు ముక్కనుమా అని పిలుస్తారు. అంతేకానీ ఈరోజు ప్రయాణాలు చేయకూడదు అని కాని, పండుగ చేసుకొని తీరాలి అని కానీ కచ్చితంగా నియమాలు లేవు.