మెగా ఫ్యామిలీ అంతా ఒకలా ఉంటే… పవన్ కళ్యాణ్ మాత్రం ఇలా..! అందుకే జనసేనాని అంటారు ఏమో..!

Ads

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి తెలిసింది. ఆయన చాలా సాదాసీదాగా జీవితం గడపడానికి ఇష్టపడుతుంటారు. రాజకీయాలకు వచ్చిన తర్వాత కుటుంబ జీవితం కంటే ఎక్కువగా ప్రజల మధ్యలోనే ఉండడానికి ఆయన ప్రాముఖ్యత ఇస్తున్నారు. అయితే తాజా సంక్రాంతి సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా బెంగళూరులోని ఫామ్ హౌస్ లో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు.

ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. వీరితోపాటు అల్లు అరవింద్ కుటుంబం మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు ఇలా మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి సంక్రాంతి సంబరాలలో మునిగిపోయారు. అయితే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కొడుకు కూతురు ఆ అకిరా, ఆధ్య కూడా హాజరయ్యారు.

pawan kalyan sankranti celebrations

Ads

ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులు ఈ ఫోటోలు తెగ వైరల్ చేస్తున్నారు. అయితే ఈ వేడుకకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం దూరంగా ఉన్నారు. సంక్రాంతిలో అమరావతిలో రాజధాని రైతులతో కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం కనుమ రోజు తన ఫామ్ హౌస్ లో గోవుల మధ్య కనుమ వేడుకలు జరుపుకున్నారు. పశువులకు పండ్లు తినిపిస్తూ వాటి మధ్య కాసేపు గడిపారు.

రైతుల పండగ సంక్రాంతి నాడు రైతులకు చేదోడువాదోడుగా ఉండే పశువులు కూడా కుటుంబంలో భాగమని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలిపారు. కుటుంబమంతా ఒక చోట చేరి ఆనందంగా గడుపుతుంది పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజల మధ్య ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారితో కలిసి పండగ చేసుకున్నారు. ఇది చూసి పవన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కదా పవన్ కళ్యాణ్ అంటే… ఇదే కదా ఆయన అసలైన వ్యక్తిత్వం… అంటూ కామెంట్లు చేస్తున్నారు. జనసేనాని అంటూ పవన్ కళ్యాణ్ ని ఊరికనే అనరు అని ఈ ఉదాహరణ చూపిస్తున్నారు

Previous articleనెట్టింట వైరల్ అవుతున్న కళ్యాణ్ రామ్ భార్య పిల్లల ఫొటోస్.. క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్.!
Next articleఅఖిల్ అక్కినేనిలో ఇది గమనించారా..? ఇందుకు కారణం ఏమయ్యి ఉంటుంది..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.