Ads
అక్కినేని కుటుంబం వారసుడు అఖిల్ అక్కినేని సినీ జర్నీ అంత సాఫీగా సాగడం లేదు. ఎంట్రీ ఇచ్చిన దగ్గరుండి ఐదు సినిమాలు చేశాడు. కానీ ఒక్క బ్యాచిలర్ సినిమా తప్పిస్తే అఖిల్ కు మంచి ఫలితాన్ని ఇచ్చిన సినిమా లేదు.
తాజాగా వచ్చిన ఏజెంట్ సినిమా కూడా డిజాస్టర్ అయింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా అట్టర్ ఫ్లాప్ అయింది.
Ads
అయితే తాజాగా అక్కినేని అఖిల్ ప్రభాస్ సలార్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు. అయితే ఇక్కడ ఎడమ చేతికి కట్టుతో అఖిల్ కనిపించాడు. ఇది చూసిన అక్కినేని అభిమానులు అందరూ అఖిల్ చేతికి ఏమైంది అంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. అఖిల్ ఈమధ్య బయటకు వచ్చింది లేదు… అయితే అసలు ఈ గాయం ఏంటి? ఎప్పుడయింది అనే దాని పైన ఎటువంటి వివరాలు లేవు.
అఖిల్ ప్రస్తుతం యువి క్రియేషన్స్ బ్యానర్ లో అనిల్ అనే కొత్త దర్శకుడు తో సినిమా చేయనున్నారు.
అఖిల్ సినిమాను నిర్మించేది యువి సంస్థ కావడంతో సలార్ సినిమా సెలబ్రేషన్స్ కు అక్కినేని అఖిల్ ను ఇన్వైట్ చేసి ఉంటారు. అయితే అఖిల్ ఒకవేళ సీక్రెట్ గా షూటింగ్ లో పాల్గొంటున్నారేమో, షూటింగ్ లో భాగంగా చేతికి గాయం అయ్యి ఉంటుంది ఏమో అని పలువురు అంటున్నారు. ఇందులో ఏది వాస్తవం అనేది ఆయన తరపున టీమ్ స్పందించి చెబితే గాని తెలియదు. ఏది ఏమైనా అఖిల్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం