హనుమాన్ సినిమా డైరెక్టర్ ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నారా..? అప్పుడు అలా అన్న వ్యక్తి సక్సెస్ వచ్చాక..?

Ads

సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాల్లో హనుమాన్ సంచలన విజయం సాధించింది. రిలీజ్ అయిన ప్రతి చోట హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఓవర్సీస్ లో కూడా 3 మిలియన్ మార్కును చేరుకుంది. పలుచోట్ల బాహుబలి, అర్అర్ఆర్ రికార్డులను కూడా బ్రేక్ చేసింది.

ఇప్పటికి నాలుగు రోజుల్లో 100 కోట్లు మార్కులు అందుకున్న ఈ సినిమా మరిన్ని సంచలన రికార్డులను సృష్టించే విధంగా దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను చూడడానికి టిక్కెట్లు దొరకడం లేదంటే ఈ సినిమా ఏ రేంజ్ విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు.

hanuman movie director prasanth varma struggles

Ads

అయితే హనుమాన్ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా టీం ఎన్నో కష్టాలు పడింది. మంచి సినిమా తీసినా కూడా థియేటర్ లు దొరకక ఇబ్బందులు పడ్డారు. అయితే నేను మంచి సినిమా తీసాం ఆ హనుమంతుడే మా తోడుగా ఉంటారంటూ సినిమా టీం నమ్మింది. ఇప్పుడు అదే నిజమైంది. అయితే ఇప్పుడు అందరూ కూడా హనుమాన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే సక్సెస్ లో ఉండగా అందరూ మాట్లాడుకోవటం మామూలుగానే డైరెక్టర్ కాకముందు ప్రశాంత్ వర్మ ఎదుర్కొన్న అవమానాలు గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

hanuman review

తాను డైరెక్టర్ ముందు ఒక సినిమా ఆఫీసుకు వెళ్లగా అక్కడ ఒక రూమ్ లో నిర్మాత దర్శకుడు మాట్లాడుకుంటున్నారని… తనని ఎక్కడ చూసి బయటికి వెళ్లిపోమని ఒక బూతు పదంతో మాట్లాడరనీ… ఆ విషయం చాలా బాధించిందని చెప్పుకోచ్చాడు. అయితే తర్వాత తాను సక్సెస్ లోకి వచ్చాను తర్వాత ఆ డైరెక్టర్ తన భుజం మీద చేయి వేసి తను మా వాడు మా వాడు అంటూ చెప్పుకుంటున్నాడని అన్నారు. ఇది ఇండస్ట్రీలో చాలా కామన్ అని అన్నాడు

Previous articleఅఖిల్ అక్కినేనిలో ఇది గమనించారా..? ఇందుకు కారణం ఏమయ్యి ఉంటుంది..?
Next articleతండ్రి, మామయ్య, తాత… ముగ్గురు హీరోలే..! ఈ అబ్బాయి ఎవరో తెలుసా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.