Ads
సంక్రాంతి సీజన్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా క్రేజ్ ఉంటుంది ఆ సీజన్ లో తమ సినిమాలు రిలీజ్ చేయాలని హీరోలు, నిర్మాతలు ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సీజన్ లో మినిమం టాక్ వచ్చినా కూడా మంచి కలెక్షన్స్ సాధించవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా సినిమాకి ఎగబడతారు. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా తెలుగులో నాలుగు పెద్ద సినిమాలు విడుదల అయ్యాయి.
అందులో మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్,నాగార్జున నా సామి రంగా, తేజ సజ్జా హనుమాన్ సినిమాలు ఉన్నాయి. అన్నిట్లో కల్లా హనుమాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వగా, మహేష్ బాబు గుంటూరు కారం సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది. నాగార్జున నా సామి రంగా కూడా బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు వేస్తుంది. అన్ని సినిమాల్లో కెల్లా వెంకటేష్ సైంధవ్ సినిమా మాత్రం మంచి టాక్ వచ్చినా కూడా పూర్ కలెక్షన్స్ సాధిస్తుంది.
Ads
సంక్రాంతి అనేది ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేసేది సీజన్…అందరూ కూడా మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాకి వెళ్లాలనుకుంటారు. కానీ సైంధవ సినిమా కథ బాగున్న కూడా ఇది థ్రిల్లర్ జోనర్. అందుచేత ఎక్కువమంది హనుమాన్ నా సామి రంగ గుంటూరు కారం సినిమాలకు ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఒకవేళ సైంధవ్ సినిమా సంక్రాంతి కాకుండా వేరే ఏ రోజు వచ్చినా కూడా మంచి హిట్ అయ్యేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. సంక్రాంతికి వచ్చి సైంధవ్ సినిమా టీం పెద్ద తప్పు చేసిందని చెబుతున్నారు