Ads
విక్టరీ వెంకటేష్ కెరీర్ లో 75వ సినిమాగా రూపొందించిన సైంధవ్ తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలైంది. అయితే ఈ సినిమా ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ప్రేక్షకుల ఆదరణ తెచ్చుకోలేకపోయింది.
సినిమా కథ బాగున్నప్పటికీ కూడా రాంగ్ టైం రిలీజ్ సినిమాని బాగా దెబ్బ తీసింది.
వెంకటేష్ తో పాటు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, ముకేశ్ రిషి, జిషు సేన్ గుప్త, తమిళ నటుడు ఆర్య ముఖ్య పాత్రలు పోషించారు.సారా పాలేకర్ అనే చిన్నమ్మాయి కూడా ఇందులో చేసింది. శ్రద్ధ శ్రీనాథ్, రుహాణి శర్మ, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో కనపడతారు.ఎక్కువ పరభాషా నటులు ఉండడంతో కాస్త మైనస్ గా మారింది.
Ads
అయితే ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ బడ్జెట్ కి సంబందించిన న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. ఇది అందరూ షాక్ అవుతున్నారు.హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తెలుగు సినిమా చెయ్యను అని అన్నా కూడా అతనికి సుమారు రూ.10 కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చారని తెలిసింది. అలాగే తమిళ నటుడు ఆర్యకి రూ. 5 కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చారని తెలిసింది.ఇక మిగతా వాళ్ళకి ఇచ్చిన పారితోషికాలు కలుపుకుంటే ఈ సినిమాకి నిర్మాత బోయినపల్లి వెంకట్ చాలా ఖర్చు పెట్టారని తెలిసింది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ విడుదలకి ముందు బిజినెస్ కేవలం రూ.25 కోట్లు మాత్రమే అయిందని తెలుస్తోంది.నిర్మాతకి చాలా నష్టం రావొచ్చు అని కూడా పరిశ్రమలో టాక్ నడుస్తోంది.ఓటిటి, శాటిలైట్,హిందీ హక్కులు అమ్ముకుంటే అది కొంచెం రికవరీ అవ్వచ్చు అని అంటున్నారు