Ads
జనవరి 22వ తారీఖున అయోధ్యలో శ్రీరాముడి మందిర ప్రారంభోత్సవం… బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా జరగనున్నాయి. అయితే రాముని విగ్రహం ప్రతిష్టించి సమయంలో గర్భగుడిలోకి ఎవరెవరు ప్రవేశిస్తారు అని దానిపైన రామ మందిర నిర్మాణ ట్రస్టు ఒక ప్రకటన విడుదల చేసింది.
మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు 84 సెకన్ల పాటు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే ఆ సమయంలో గర్భగుడిలో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఉండనున్నట్లు ఆలయ ట్రస్ట్ తెలిపింది.
Ads
అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS )చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్, రామమందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఉంటారని తెలిపింది. ఇక ప్రాణ ప్రతిష్ట జరిగే సమయంలో ప్రధన ఆలయాన్ని మూసి వేస్తారు. గర్భగుడిలో ప్రతిష్ట జరిగే వరకు విగ్రహానికి కళ్లగంతలు ఉంటాయి. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తైన తర్వాతే ఆ కళ్లకు గంతలను తొలగిస్తారు.
ముందుగా శ్రీరాముడి కళ్లకు కట్టిన గంతలను ప్రధానమంత్రి నరేంద్రమ మోదీ తెరవనున్నారు. ఆ తర్వాత అద్దంలో రాముడికి తన విగ్రహాన్ని చూపించడంతో ఈ కార్యక్రమం పూర్తి కానుంది. ఈ ఘట్టం అనంతరం అఖండ హారతి ఇవ్వనున్నారు. తర్వాత 3 బృందాల పండితులు పూజలు నిర్వహిస్తారు. మొదటి బృందం స్వామి గోవింద్ దేవగిరి మహరాజ్, రెండవ బృందం శంకరాచార్య విజేంద్ర సరస్వతి, మూడవ బృందం కాశీ పండితుల నేతృత్వంలో పూజలు జరగనున్నాయి.