Ads
ప్రపంచ కుబేరులుగా నిలిచారంటే వారి ఇల్లు ఎన్ని ఎకరాల్లో ఉంటుందో మీకు తెలుసా…. వారి ఫ్యామిలీ మొత్తం ఎంతమంది ఉంటారో తెలుసా…!
ప్రపంచంలోనే అత్యంత కుబేరుడిగా నిలిచారంటే వారు సామాన్యులు కారు… యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యన్ రాజ కుటుంబం… ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం గా రికార్డుల్లోకి ఎక్కింది. 2023 లో వీరి ఆస్తి 25 లక్షల కోట్లుగా తేలింది.
ఈ రాజ కుటుంబంలో మొత్తం 18మంది సోదరులు 11 మంది సోదరులు సోదరీమణులు ఉన్నారు. రాజ కుటుంబ పెద్ద అయినా షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్ కు 9 మంది సంతానం. ఇతనికి 18 మంది మనవాళ్ళు మనవరాలు ఉన్నారు. బ్రిటిష్ రాజకుటుంబంలో సమానంగా ఈ రాజ కుటుంబానికి ఆస్తులు ఉన్నాయని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చమరు నెలలలో ఆరు శాతం వీరి కుటుంబం పేరు మీదే ఉన్నాయి. మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ క్లబ్ కూడా 2008లో ఈ రాజ కుటుంబం రూ. 2,122 కోట్లకు కొనుగోలు చేసింది.
Ads
ఇవే కాకుండా ఎలొన్ మస్క్ స్పేస్ X తో పాటు పలు కంపెనీలలో వీళ్ళకి వాటాలు ఉన్నాయి. అంతేకాకుండా వీరి కుటుంబానికి చెందిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఆదాయం గత ఐదేళ్లలో 28 వేల శాతం పెరిగింది. ఈ కుటుంబానికి ఎంత మొత్తంలో ఆస్తులు ఉన్నాయంటే వీరు నివసించే ఇల్లు కూడా ఎంత భారీగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అబుదాబిలోని ఖాదర్ అల్ వతన్ రాజ భవనంలో ఈ రాజ కుటుంబం నివసిస్తుంది. 98 ఎకరాలు విస్తీర్ణం లో ఉన్న ఈ ప్యాలెస్ విలువ రూ.4078 కోట్లు. ఈ కుటుంబం వద్ద ప్రపంచంలో ఉన్న 700 పైగా కార్ల కలెక్షన్ ఉంది. ప్రైవేటు నౌకలు, ప్రైవేట్ విమానాలు ఈ కుటుంబం సొంతం