Ads
మన వెండి తెర మీద రామాయణం పై ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో శ్రీరామునిగా నటించిన నటులు ఎంతమంది ప్రజలకు చేరువయ్యారో చూద్దాం. రాముడికి, తెలుగు సినిమాకి అవినాభావ సంబంధం ఉంది. రాముని అవతారం ఎంత ఉత్తమమైనది. ఆ అవతారంలో ఎన్నో మానవీయ విలువలు, మరెన్నో సంస్కృతి సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థలోని అనుబంధాలు రామాయణాన్ని చూసి తెలుసుకోవచ్చు. అయితే ఇంతమంది రామచంద్రులలో ఎవరు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారో చూద్దాం.
#1. యడవల్లి సూర్యనారాయణ:
1932లో విడుదలైన శ్రీ రామ పాదుక పట్టాభిషేకం సినిమాలో సినిమాలలో తొలిసారిగా రాముని పాత్రను తెరపై చూపించిన నటుడు.
#2. నందమూరి తారక రామారావు:
ఈయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. రాముని పాత్ర కోసమే ఈయన పుట్టాడా అనిపించే అంత అద్భుతంగా కనిపిస్తారు ఎన్టీఆర్. ఎన్నో సినిమాలలో రాముని పాత్రలో నటించి మెప్పించిన నటుడు నందమూరి తారక రామారావు. ఈయన సంపూర్ణ రామాయణం, శ్రీరామ పట్టాభిషేకం, రామాంజనేయ యుద్ధం వంటి సినిమాలలో రాముని పాత్ర వేసి మెప్పించారు.
#3. హరనాథ్:
ఎన్టీఆర్ తర్వాత ఆ లెవెల్ లో అందంతో నటనతో మెప్పించిన నటుడు హరనాధ్. ఆయన సీతారామ కళ్యాణం, శ్రీ రామ కథ అనే సినిమాలలో రాముడు గా నటించి ఇప్పటికీ మన గుండెల్లో నిలిచిపోయాడు.
#4. కాంతారావు:
ఈయన వీరాంజనేయ సినిమాలో రామునిగా నటించి మెప్పించారు.
#5. అక్కినేని నాగేశ్వరరావు:
Ads
సీతారామ జననం సినిమాలో రాముని పాత్రలో నటించాడు.
#6. శోభన్ బాబు :
సంపూర్ణ రామాయణం సినిమాలో శ్రీరాముడుగా నటించి మెప్పించిన ఘనత ఈయనది.
#7. రవి:
బాపు దర్శకత్వంలో వచ్చిన సీతా కళ్యాణం సినిమాలో మలయాళం నటుడు రవి శ్రీరాముడుగా నటించి పర్వాలేదు అనిపించుకున్నారు.
#8. సుమన్ :
శ్రీరామదాసు సినిమాలో సుమన్ రాముని పాత్ర ధరించి ప్రజల హృదయాలని గెలుచుకున్నారు.
#9. శ్రీకాంత్:
దేవుళ్ళు సినిమాలో రాముడిగా కాసేపు కనిపించి మెప్పించారు.
#10. బాలకృష్ణ:
శ్రీరామరాజ్యం సినిమాలో రాముడు గా నటించి తన సాత్విక అభినయాన్ని ప్రేక్షక లోకానికి రుచి చూపించారు.
#11. జూనియర్ ఎన్టీఆర్:
బాల రామాయణం సినిమా లో రాముడిగా నటించి తన సినీ కెరీర్ ని ప్రారంభించిన నటుడు.
#12. ప్రభాస్:
ఆది పురుష్ సినిమాలో రాముడిగా నటించి అభినవ రాముడిగా ప్రశంసలు అందుకున్నాడు.
అయితే తెలుగు సినీ పరిశ్రమలో ఎంతమంది రామచంద్రులు ఉన్నప్పటికీ నందమూరి తారక రామారావు చుక్కల్లో చంద్రుడు అన్నది అందరూ ఒప్పుకున్న సత్యం.