Ads
శ్రీరామ జన్మస్థలం అయిన అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. వేలాది మంది ఎన్నో త్యాగాలు చేశారు. వారందరి కల సోమవారం నాడు సాకారం అయ్యింది. ఈ సందర్భంగా వారి త్యాగలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Ads
అలాంటి వారిలో పుల్లారెడ్డి స్వీట్స్ ఫౌండర్ జి.పుల్లారెడ్డి ఒకరు. రామ మందిరం కోసం సాగిన సుధీర్ఘ పోరాటంలో విశ్వ హిందూ పరిషత్ ముఖ్య పాత్ర పోషించింది. ఆ సమయంలో విశ్వ హిందూ పరిషత్ కోశాధికారిగా పుల్లారెడ్డి ఉన్నారు. ఆయన పాత్ర ఏమిటో ఇప్పుడు చూద్దాం..
అయోధ్యలో రామ మందిరాన్ని దాదాపు రూ.1800 కోట్లతో నిర్మించారు. ఇంత భారీగా ఖర్చు చేసినా, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దగ్గర భారీ నిధులు ఉన్నాయి. అయితే రామ మందిరం నిర్మాణం అంత తేలికగా జరగలేదు. వీహెచ్‌పీ (విశ్వ హిందూ పరిషత్) రామ జన్మభూమి కేసులో కీలక పాత్ర వహించింది. వీహెచ్‌పీ కోశాధికారిగా ఉన్న పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని గుణంపల్లి పుల్లారెడ్డి ఈ పోరాటానికి వెన్నుదన్నుగా ఉన్నారు. ఈ పోరాటంలో పుల్లారెడ్డి పాత్ర మర్చిపోలేనిది.
అయోధ్య రామ మందిరం కోసం న్యాయపోరాటానికి కావాల్సిన ఖర్చులను భరించేందుకు పుల్లారెడ్డి ముందుకొచ్చారు. వీహెచ్‌పీకి కోర్టు ఖర్చులకు 25 లక్షల రూపాయలు అవసరమయ్యాయి. అందుకు వీహెచ్‌పీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అశోక్ సింఘాల్ పుల్లారెడ్డిని హైదరాబాద్ లో కలిశారు. అశోక్ సింఘాల్ రామ మందిర కేసు కోర్టు ఖర్చులకు అవసరమైన డబ్బు గురించి చెబుతూ బాధపడడంతో పుల్లారెడ్డి వెంటనే ఇంట్లోఉన్న రూ.2 లక్షలు తెచ్చి సింఘాల్ చేతిలో పెట్టారు. సాయంత్రంలోగా 10 లక్షల రూపాయలు సర్దుబాటు చేస్తానని తెలిపారు.
అలా తెలిసిన వారి దగ్గర నుండి డబ్బులు తెచ్చి సింఘాల్‌కు ఇచ్చారు. కోర్టు ఖర్చుల నిమిత్తం తన ఇంటిని అమ్మడానికి సిద్ధమని, చివరికి తన భార్య ఆభరణాలు కూడా ఇస్తానని, చెప్పారు. రామ మందిర నిర్మాణం కోసం తన యవదాస్తిని ధారబోసేందుకు సిద్ధమని పుల్లారెడ్డి అన్నారు. తాను ఉన్నని రోజులు కోర్టు ఖర్చులకు లోటు లేకుండా చూస్తానని పుల్లారెడ్డి సింఘాల్‌కు హామీ ఇచ్చారు. అశోక్ సింఘాల్ ఈ విషయాలను పుల్లారెడ్డి కన్నుమూసిన తర్వాత ఆయన శ్రద్ధాంజలి సభలో స్వయంగా వెల్లడించారు. ఆయన కోరుకుకున్నట్టు రామమందిర నిర్మాణ కల సాకారం అయ్యింది.
Also Read: అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం..! అసలు విషయం ఏంటంటే..?