Ads
హైదరాబాద్ మహానగరంలో ఎంతోమంది పొట్ట పట్టుకుని జీవనాధారం కోసం వస్తూ ఉంటారు. అలా వచ్చి తమకు వచ్చిన పని చేసుకుని బాగా సెటిలై సంపాదించిన వారు ఉన్నారు. ఏమీ చేతకాక తిరిగి వెళ్లిపోయిన వారు ఉన్నారు. అయితే మనలో ఏ టాలెంట్ ఉందో అది గుర్తించి దాన్ని వ్యాపారంగా మార్చుకుంటే సంపాదనకు తిరిగి ఉండదు. హైదరాబాద్ అంటే ఫుడ్డుకి పెట్టింది పేరు.
హైదరాబాద్ అనగానే మనకి గుర్తు వచ్చేది ధమ్ బిర్యాని. అయితే బిర్యానీ కాకుండా. రకరకాల వంటకాలు వండుతూ స్ట్రీట్ ఫుడ్ తో బిజినెస్ చేస్తూ ఫేమస్ అయిన వారు కూడా ఉన్నారు వారిలో ఒకరు కుమారి ఆంటీ.. తాజాగా సోషల్ మీడియాలో ఈమె ఒక సెన్సేషన్ అయ్యారు. ఎన్నో రకాల నాన్ వెజ్ ఐటమ్స్ తో భోజనాలు వడ్డిస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ ఈమె అందరికీ బాగా చేరువయ్యారు. అసలు ఎవరు ఈమె? ఏమిటి కథ? అనేది తెలుసుకుందాం.
ఎవరు ఈమె:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుడివాడకు చెందిన దాసరి సాయి కుమారి 2011లో ఈ స్ట్రీట్‌ఫుడ్ సెంటర్‌ను ప్రారంభించారు. హైదరాబాద్ మాధాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఈ స్ట్రీట్‌ఫుడ్ బిజినెస్‌ను ఏర్పాటు చేశారు. తక్కువ ధరకే రుచికరమైన వెజ్, నాన్‌వెజ్ వంటకాలను అందిస్తూ క్వాలిటీ ఫుడ్ తో బాగా ఫేమస్ అయ్యారు. తొలుత 5 కేజీలతో ప్రారంభమైన కుమారి ఫుడ్ బిజినెస్ ప్రస్తుతం రోజుకు క్వింటాకు పైగా అమ్ముడు అయ్యే స్థాయికి చేరింది. కొందరు యూట్యూబ్ ఫుడ్ వ్లాగర్స్ వరుసగా ఆమెపై వీడియోలు చేయడంతో ఒక్కసారిగా కుమారి ఆంటీ ట్రెండింగ్‌లోకి వచ్చారు.
Ads
ఏం దొరుకుతాయి:
కుమారి ఆంటీ దగ్గర చాలా రకాల వంటకాలు దొరుకుతాయి.వైట్ రైస్, బగారా రైస్, గోంగూర రైస్, గోబీ రైస్, టమాటా రైస్, లెమన్ రైస్, జీరా రైస్, పెరుగన్నం వంటి రైస్ ఐటెమ్స్ ఉన్నాయని కుమారి తెలిపారు. నాన్‌వెజ్‌కు వచ్చే సరికి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ కర్రీ, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్ కర్రీ తన వద్ద దొరుకుతాయని చెప్పారు. వెజ్‌లో ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, రెండు చట్నీలతో పాటు పప్పు, సాంబారు, మజ్జిగను అందిస్తున్నట్లు తెలిపారు.ఒక కర్రీతో ప్లేటు తీసుకుంటే రూ.100 , రెండు కర్రీలు తీసుకుంటే ప్లేటు రూ.150, మూడు తీసుకుంటే రూ.200 అలా ఐటెమ్‌ను బట్టి రేటు ఉంటుందని ఆమె చెప్పారు.
తాజాగా సినిమా టీం కూడా ప్రమోషన్స్ కోసం కుమారి ఆంటీ వద్దకు వెళ్తున్నారంటే ఈమె రేంజ్ ఏవిధంగా పెరిగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా ఖాళీ లేకుండా ఫుడ్ బిజినెస్ చేస్తున్న కుమారి ఆంటీ ఒకరోజు సంపాదన 30000. ఎంతో కష్టపడితే గాని ఈ స్థాయికి చేరుకోలేదని విషయాన్ని మనం గమనించాలి. ఇలాంటివారిని ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా జీవితంలో ముందుకు ఎదగవచ్చు.
#OoruPeruBhairavakona team visited Hyderabad's famous aunty's food stall 🤩 pic.twitter.com/48dtwo2OnX
— Actual India (@ActualIndia) January 21, 2024