Ads
ఐదు శతాబ్దాలు, అంటే 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్యలోని రామ మందిరంలో రాముడు కొలువుతీరాడు. శ్రీరాముడి విగ్రహాన్ని నరేంద్ర మోడీ ప్రతిష్టించారు. ఈ విగ్రహ ప్రతిష్ట వేడుకకి ఎంతో మంది ప్రముఖులు హాజరు అయ్యారు.తెలుగు నుండి సినీ నటులు చాలా మంది ఉన్నారు. చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ మాత్రం ఈ వేడుకలో హాజరు అయినట్టు కనిపించారు. తమిళ్ నుండి రజినీకాంత్ హాజరు అయ్యారు. హిందీ నుండి మాత్రం చాలా మంది ఈ వేడుకకి వెళ్లారు.
అయితే టాలీవుడ్ లో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లకి ఈ వేడుకకు ఆహ్వానం అందింది. కానీ కొన్ని కారణాల వల్ల వెళ్లలేకపోయారు. దీంతో ఆ ఇద్దరు హీరోలు ఎందుకు హాజరు కాలేదు అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Ads
సినిమా బృందం అంతా కూడా రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నారు. సినిమా రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. మొదటి భాగానికి సంబంధించి ఇటీవల ఒక చిన్న టీజర్ కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఉండడంతో జూనియర్ ఎన్టీఆర్ అయోధ్యకి వెళ్లలేకపోయారు.
జూనియర్ ఎన్టీఆర్ బయట ఎక్కడ పెద్దగా కనిపించట్లేదు. సినిమా షూటింగ్ కూడా భారీ సెట్టింగ్స్ మధ్యలో జరుగుతోంది. దేవరలో సైఫ్ అలీ ఖాన్ తో కీలక సన్నివేశాన్ని షూట్ చేయాల్సిన కారణంగా నిర్మాతను ఇబ్బంది పెట్టకూడదని భావించిన తారక్ అయోధ్యకు వెళ్ళలేదు అంట.
ఇక సలార్ తో హిట్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తున్న కల్కి సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. అలాగే మారుతి డైరెక్షన్ లో తెరకెక్కనున్న రాజా సాబ్ సినిమాతో కూడా బిజీ గా ఉన్నాడు. ఇటీవలే ఆ సినిమా పోస్టర్ కూడా విడుదలైంది. ఈ షూటింగ్ బిజీ వల్లే ఇటీవల జరిగిన కృష్ణంరాజు గారి పుట్టినరోజు రోజు వేడుకలలో కూడా ప్రభాస్ కనిపించలేదు. ఇదే కారణంతో ప్రభాస్ అయోధ్యకి కూడా హాజరు కాలేకపోయారు.