‘యానిమల్’ యాక్టర్ బాబీ డియోల్ భార్య ఎవరో..? ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటో తెలుసా..?

Ads

టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్ హీరో రణభీర్ కపూర్ కాంబోలో తెరకెక్కిన ‘యానిమల్’ మూవీ పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భారీ కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 900 కోట్ల రూపాయలు రాబట్టింది.

త్వరలో ఓటీటీలో సందడి చేయనున్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీలో విలన్ గా నటించిన బాబీ డియోల్ సౌత్ ఇండియాలో కూడా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అతని భార్య ఎవరో? ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
యానిమల్ మూవీ ఎంత పాపులర్ అయ్యిందో, అందులోని జమల్ కుడు పాట కూడా అంతే పాపులర్ అయ్యింది. ఈ పాటతో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ చాలా ఫేమస్ అయ్యాడు. సౌత్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ ను తెచ్చుకున్నాడు. బాబీ డియోల్ బాలీవుడ్ సీనియర్ యాక్టర్ ధర్మేంద్ర తనయుడు. సన్నీ డియోల్ సోదరుడు.

హీరోగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన అతను, ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్, విలన్ రోల్స్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఇక యానిమల్ మూవీతో అతనికి మరింత క్రేజ్ పెరిగింది.1996లో బాబీ డియోల్ బాబీ తాన్యను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. ఆమె పారిశ్రామికవేత్త దేవేంద్ర అహుజా కుమార్తె. ఈ జంటకి ఆర్యమాన్ డియోల్, ధరమ్ డియోల్ అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ప్రస్తుతం వీరు ముంబైలో సుమారు 6 కోట్ల రూపాయల విలువ కల లగ్జరీ భవంతిలో నివసిస్తున్నారు.
దేవేంద్ర అహుజా తాన్యకు 300 కోట్ల రూపాయల ఆస్తిని ఇచ్చాడని అప్పట్లో వార్తలు వినిపించాయి. తాన్య కూడా తండ్రిలాగే పారిశ్రామికవేత్త. తాన్య ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ చేసింది. ఆమెకు సొంత ఫర్నిషింగ్ స్టోర్ ఉంది. ఆమె ఆస్తి విలువ రూ. 300 కోట్లు కాగా, బాడీ డియోల్ ఆస్తి విలువ రూ. 66 కోట్లు అని తెలుస్తోంది.

Also Read: ఆ ఒక్క సీన్ బాగోలేదని…బాలయ్య సమరసింహా రెడ్డి సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా.?

Previous articleఅయోధ్య రాముడు ప్రాణప్రతిష్టరోజు పుట్టిన ముస్లిం బాలుడు…ఏం పేరు పెట్టారంటే.?
Next articleఅమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.