అయోధ్య రాముడు ప్రాణప్రతిష్టరోజు పుట్టిన ముస్లిం బాలుడు…ఏం పేరు పెట్టారంటే.?

Ads

భారతదేశమంటే మతసామరస్యానికి పెట్టింది పేరు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిసికట్టుగా జీవిస్తూ ఉంటారు.ఒకరి పండుకులకు ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉంటారు. తాజాగా అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగినప్పుడు దేశంలో పలుచోట్ల ముస్లింలు హిందువులకు ప్రసాదాలు పంచి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాగే హిందువులతో కలిసి రామనామ కీర్తనలలో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి.

అయితే తాజాగా ఒక ముస్లిం మహిళ తనకి పుట్టిన బాబుకి రాముడు పేరు పెట్టుకుని తన మతసామరస్యాన్ని మరోసారి చాటి చెప్పింది. జనవరి 22 తారీఖున బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
అదే రోజున చాలామందికి కాన్పులు కూడా జరిగాయి.

Ads

ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ కు చెందిన ఫర్జానా సోమవారం మధ్యాహ్నం మగ బిడ్డకు జన్మనిచ్చింది. దేశమంతా అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠ సంబరాల్లో మునిగి ఉండడం, ముహూర్త సమయంలోనే తనకు నార్మల్ డెలివరీ కావడంతో పుట్టిన బిడ్డకు రాముడి పేరు పెట్టుకున్నట్లు ఫర్జాన చెప్పింది. రామ్ రహీమ్ అంటూ నామకరణం చేసింది.

రాముడి ప్రాణ ప్రతిష్ట చేసేది దివ్యమైన ముహూర్తం కావడంతో పలువురు గర్భిణీలు పట్టుబట్టి సిజేరియన్ చేయించుకుని బిడ్డలను కన్నారట. అయితే అదే సమయంలో కొంతమంది మహిళలకు నార్మల్ డెలివరీ కూడా జరిగింది.ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లోనే సోమవారం 25 మంది గర్భిణిలు ప్రసవించారు. వీరిలో 10 మంది అమ్మాయిలు, 15 మంది అబ్బాయిలు వున్నారని.. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అబ్బాయిలకు రాముడి పేరు, అమ్మాయిలకు సీత పేరు కలిసి వచ్చేలా పేర్లు పెట్టుకున్నారని వైద్యులు చెప్పారు. మొత్తం మీద ఆ రాముని ప్రాణప్రతిష్ట రోజు పుట్టిన పిల్లలు కూడా ఆ రాముడు తేజస్సు ఉండాలని వారి తల్లిదండ్రులు ఆకాంక్షగా చెప్పుకోవచ్చు.

Previous articleఇర్రెగ్యులర్ పీరియడ్స్‌ కు బ్రహ్మముడి సీరియల్ కావ్య చెప్పిన చిట్కా..! ఏంటంటే.?
Next article‘యానిమల్’ యాక్టర్ బాబీ డియోల్ భార్య ఎవరో..? ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటో తెలుసా..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.