Ads
అయోధ్య రామ మందిరంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఎన్నో దశాబ్దాల నుండి రామ మందిర నిర్మాణం కోసం ఎదురుచూసిన భక్తులు బాలరామున్ని దర్శించుకోవడం కోసం దేశంలోని నలుమూలల నుండి భక్తులు అయోధ్యకు పోటెత్తుతున్నారు.
Ads
భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో అయోధ్య జన సంద్రంగా మారుతోంది. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్యంగా వీఐపీలను మాత్రమే అనుమతించిన విషయం తెలిసిందే. మంగళవారం నుండి సాధారణ భక్తులకు అనుమతించడంతో అయోధ్య భక్తులతో నిండిపోయింది. అయితే ప్రాణ ప్రతిష్ఠ రోజు లక్షల కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
రామ మందిర ప్రాణ ప్రతిష్టతో భక్తుల కల నెరవేరమే కాకుండా ఆర్ధిక వ్యవస్థతో ముడిపడి ఉంది. అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా రూ.1.25 లక్షల కోట్ల వ్యాపార జరిగిందని సీఏఐటీ (అఖిల భారత వ్యాపారుల సమాఖ్య ) అంచనా వేసింది. ఈ నివేదిక ప్రకారం, అయోధ్యలోని రామ మందిరం యొక్క చారిత్రాత్మక ‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుకకు ముందు ప్రజలు షాపింగ్ కు వెళ్లారు. ఉత్తరప్రదేశ్‌లో రూ.40,000 కోట్ల బిజినెస్ కాగా, ఢిల్లీలో రూ.25,000 కోట్ల బిజినెస్ జరిగిందని సీఏఐటీ నివేదిక పేర్కొంది.
చిన్న వ్యాపారులు అత్యధిక లాభాలు పొందారని సీఏఐటీ జాతీయ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు. భక్తి ద్వారా ఇంత పెద్దమొత్తంలో బిజినెస్ జరగడం, పెద్ద మొత్తంలో మార్కెట్‌లోకి రావడం కూడా ఇదే మొదటిసారి అన్నారు. జనవరి 1 నుండి 22 వరకు “హర్ షెహెర్ అయోధ్య, హర్ ఘర్ అయోధ్య” అంటూ జరిగిన ప్రచారంలో దేశవ్యాప్తంగా చిన్న మరియు పెద్ద వ్యాపార సంస్థలు 1.5 మిలియన్లకు పైగా కార్యక్రమాలను నిర్వహించాయి.
దీంతో దేశవ్యాప్తంగా కోట్లలో రామ మందిర నమూనాలు, లాకెట్లు, పూలమాలలు, బిందెలు, కంకణాలు, రాముడి టోపీ, రాముడి జెండాలు, రాముడి పెయింటింగ్స్, చిత్రాలు అమ్మకం జరిగినట్లు తెలిపారు. వీరిలో అయోధ్య రామ మందిర నమూనాలు మరియు రాముడి చిత్రాలు అత్యధికంగా అమ్ముడయ్యాయి. అలాగే బ్రాహ్మణులు, పండిట్లు కూడా దేశవ్యాప్తంగా ఆదాయం పొందారు. ప్రసాదంగా కోట్ల కిలోల స్వీట్స్, డ్రైఫ్రూట్స్ ను విక్రయించారు. అలాగే టపాసులు కూడా పెద్ద మొత్తంలోనే అమ్ముడుపోయాయి.
Also Read: అయోధ్య రాముడిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? ఇదిగో సులభ మార్గాల వివరాలు!