Ads
ప్రముఖ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా ఎప్పుడు సినిమాలతో బిజీగా గడుపుతూ ఉంటుంది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 20 సంవత్సరాలు దాటుతున్న కూడా ఎనలేని క్రేజ్ తో ఇప్పటికీ సినిమాలు చేస్తుంది. అయితే సినిమాల నుండి తీరిక సమయం దొరికినప్పుడల్లా కూడా వ్యాయామాలు చేయడం, లేదంటే విహార యాత్రకు వెళ్లడం చేస్తుంది. అయితే తమ్మన్నాకి దేవుడు పట్ల భక్తి కూడా ఎక్కువే.
ఆమె హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యమిస్తుంది. తమన్నాకు భగవంతుని పట్ల అపారమైన నమ్మకం, భక్తి, విశ్వాసాలు ఉన్నాయి. ఈ కారణంగానే అప్పుడప్పుడు హిందూ దేవాలయాలను సందర్శిస్తూ ఉంటుంది.
Ads
ఇప్పుడు తమన్నా తన కుటుంబ సభ్యులతో కలిసి గౌహతిలోని ప్రఖ్యాత కామాక్య ఆలయాన్ని సందర్శించింది.కామాక్య ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది. ఈ సందర్భంగా పసుపు రంగు చుడీదార్, మెడలో హారం, శాలువా, నుదుటిపై కుంకుమతో ఎంతో ట్రెడిషినల్‌గా కనిపించిందీ మిల్కీ బ్యూటీ.నా ప్రియమైన వారితో కొన్ని మధురమైన భక్తి క్షణాలు గడిపాను అంటూ తమన్నా ఈ టెంపుల్ విజిట్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో షేర్ చేసుకుంది.
గతంలో ఇషా ఫౌండేషన్ అధ్వర్యంలో జరిగిన శివరాత్రి, సంక్రాంతి, లింగ భైరవి దేవి పూజల్లో కూడా తమన్నా పాల్గొంది. అలాగే తన దైనందిన జీవితంలో ధ్యానం, యోగా , ప్రాణాయామం ఒక భాగంగా చేసుకుంది. తమన్నా బాలీవుడ్ నటుడు విజయవర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే త్వరలో తమన్నా విజయ్ పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆలయాలను సందర్శిస్తుందని కూడా అంటున్నారు.