బ్రహ్మముడి షూటింగ్ లొకేషన్లో దయ్యం ఉందంటున్న స్వప్న.. అందుకే ఇల్లు మారిపోయాను అంటూ వైరల్ కామెంట్స్!

Ads

కార్తీకదీపం ఫ్లాట్ ఫామ్ లో వస్తున్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. అయితే ఈ సీరియల్ లో నటీనటులు అందరికీ యూట్యూబ్ లు ఉండటం, సోషల్ మీడియాలో వీళ్ళందరూ కలిపి హంగామా చేసిన వీడియోలు పోస్ట్ చేయటం అందరికీ తెలిసిందే అందులో హమీదా అయితే తన అందంతోను, తన అల్లరితోను తోటి నటీనటులను ఆటపట్టిస్తూ తెగ హడావిడి చేస్తూ ఉంటుంది.

అలాంటి హమీదా ఈసారి బ్రహ్మముడి షూటింగ్ లోకేషన్లో దయ్యం ఉంది అంటూ మరింత హడావిడి చేసింది. ఆ సంగతి ఏంటో చూద్దాం. బ్రహ్మముడి సీరియల్ లో అక్కాచెల్లెళ్లు ఒక ఇంటి ఫ్యామిలీలోని వారసులను పెళ్లాడిన తరువాత కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి అనే కధాంశంతో తెరకెక్కిన సీరియల్. ఇందులో స్వప్న కావ్య అనే అక్క చెల్లెలుగా హామీదా, దీపికా రంగరాజు నటిస్తున్నారు.

Ads

మరోవైపు బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ నాగులపల్లి, శ్రీకర్, కిరణ్ కాంత్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇటీవల బ్రహ్మముడి సెట్ లోకి దెయ్యం వచ్చింది అని హడావిడి చేసింది హామీదా అయితే అది రియల్ దెయ్యం కాదు. బ్రహ్మముడి షూటింగ్ లోకేషన్లో దెయ్యం ఉన్నట్టు డిటెక్ట్ చేసింది. ఎన్టైటి డిటెక్ట్ అనే యాప్ మన సెల్లో ఇన్స్టాల్ చేసుకుంటే మనము ఉన్న లొకేషన్ లో దెయ్యం ఉందా లేదా అనే విషయం తెలుస్తుందని చెప్పకొచ్చింది. మరి ఇప్పుడు బ్రహ్మముడి షూటింగ్ లోకేషన్లో దెయ్యం ఉన్నట్టు అక్కడ యాప్ ద్వారా డిటెక్ట్ చేసింది హమీదా.

ఆ దెయ్యంతో సరదాగా స్వప్న, కావ్య ఇద్దరు చాట్ కూడా చేశారు. దెయ్యం పేరు ఏంటి అని అడిగితే దాని పేరు బెడ్ సి అని తేలింది. అది ఫిమేల్ దెయ్యం అని అది చాలా మంచి దయ్యమని హార్ట్ ప్రాబ్లం కారణంగా చనిపోయిందని చెప్పకు వచ్చిందట ఆ దయ్యం. ఈ సంఘటనే కాకుండా ఇలాంటి సంఘటనే తన లైఫ్ లో ఇంకొకటి జరిగిందని చెప్పుకొచ్చింది హామీదా తన పాత ఇంట్లో ఉన్నప్పుడు నాకు అక్కడ అన్నీ నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చేవి. అప్పుడే ఈ యాప్ ఇన్స్టాల్ చేసి చూస్తే దెయ్యం ఉన్నట్లు తెలిసింది అందుకే ఆ ఇల్లు ఖాళీ చేసేసాను అని చెప్పుకొచ్చింది హమీదా.

Previous articleరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేళ.. దేశవ్యాప్తంగా ఎన్ని లక్షల కోట్ల బిజినెస్ జరిగిందో తెలుసా..?
Next articleఆ ఆలయంలో తమన్నా పూజలు… అసలు సంగతి ఇదేనా..? ఆ గుడి ఎక్కడంటే.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.