రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా స్క్రిప్ట్ చూసిన సుకుమార్ రియాక్షన్ ఇదేనా…? ఏమన్నారంటే…?

Ads

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఒక సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు RC 16 అనే వర్కింగ్ టైటిల్ కూడా పెట్టారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమా సంయుక్తంగా నిర్మించనున్నారు.

ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చునున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతూ వస్తున్నాయి.

sukumar reaction on ram charan and buchi babu script

Ads

తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం చూసిన తర్వాత సుకుమార్ షాక్ అయ్యారట. గత మూడు సంవత్సరాలుగా దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. బుచ్చిబాబు చెప్పిన ఫైనల్ వెర్షన్ కథ విని సుకుమార్ అభినందనలు వర్షం కురిపించారట. సినిమా కథ చాలా బాగా వచ్చిందని బుచ్చిబాబు విజన్ అదిరిపోయిందని అంటున్నారు. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిపోయే పాత్ర అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.
ఈ సినిమా శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది.

ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కుంటివాడిగా నటిస్తారు అనే వాదనలు కూడా ఉన్నాయి. అందులో నిజం ఎంత అనే సంగతి మాత్రం తెలియదు. ఏదేమైనా ఈ సినిమా కథ మాత్రం అదిరిపోయిందని అదే తరహాలో భారీ ఎత్తున తెరకెక్కించడానికి మేకర్ సన్నహాలు చేస్తున్నారు. మార్చి రెండో వారం నుండి సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని అంటున్నారు

Previous articleసినిమా చూస్తే వాంతి చేసుకోవాలి అనిపించిందా..? హీరోయిన్ రాధిక ఎందుకు ఇలా అన్నారు..?
Next articleగీతాంజలి… ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక బెస్ట్ హీరోయిన్ పాత్ర..! కారణాలు ఏంటంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.