Ads
బాలీవుడ్ లో సూపర్ స్టార్ అంటే ఒకప్పుడు అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర వంటి వారు ఉండేవారు. అలాంటి టైంలో మిధున్ చక్రవర్తి బయట నుంచి సినిమాలలో కొచ్చి స్టార్ డం సొంతం చేసుకుని సూపర్ స్టార్ గా నిలిచారు. మిధున్ చక్రవర్తి గొప్పతనం ఏంటంటే తన జీవితంలో 180 వరకు అట్టర్ ఫ్లాప్ సినిమాలు, ఒక 50 వరకు డిజాస్టర్ సినిమాలే ఉంటాయి. తను తీసిన 350 సినిమాలలో 200 సినిమాల వరకు అట్టర్ ఫ్లాప్లే ఉంటాయి.
1993 నుంచి 97 వరకు వరుసుగా ప్లాపులు అందుకున్నాడు మిధున్ చక్రవర్తి. అయితేనేమి తన స్టార్ డం ఏమాత్రం తగ్గలేదు దీనికి కారణం తను తీసిన 50 బ్లాక్ బస్టర్ చిత్రాలు. తను బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన మొదటి చిత్రంతోనే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుని అందుకొని ఒక రేంజ్ కి ఎదిగాడు మిధున్ చక్రవర్తి. తర్వాత డిస్కో డాన్సర్ సినిమాలో అయ్ ఆమ్ ఏ డిస్కో డాన్సర్ పాట బాలీవుడ్ తో పాటు భారతదేశాన్ని అంతా ఒక ఊపు ఊపేసింది.
Ads
భారతదేశంలో 100 కోట్లు సంపాదించిన సినిమాగా నిలిచింది ఈ చిత్రం. 1950 జూన్ 16 లో జన్మించిన మిధున్ చక్రవర్తి హీరోగా బాలీవుడ్లోకి వచ్చిన తర్వాత ఒక స్టేజ్లో తను హీరో అవ్వలేక పోతానేమో అని ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే సందర్భాలు కూడా వచ్చాయట. కానీ తనని తాను మోటివేట్ చేసుకుని సినిమాలు తీస్తూ వచ్చారు. ఒక ఇంటర్వ్యూలో తను తీసిన సినిమాలలో వందకు పైగా తనే చూడలేదు అని చెప్పారు మిధున్.
నక్సలైట్ అవ్వాలని తనకున్న కోరిక మేరకు నక్సలైట్ గా వెళ్లారు తర్వాత తన అన్న చనిపోవడంతో తిరిగి వచ్చి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. సినిమా ఇండస్ట్రీలో ఉండగా యోగితనీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మిథున్ చక్రవర్తి. ఇప్పుడు వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ల ఆస్తి సుమారు 400 కోట్ల వరకు ఉంటుంది. ఈ సంవత్సరం పద్మ అవార్డుల జాబితాలో తన పేరుని సంపాదించుకొని పద్మభూషణ్ ని అందుకున్నాడు మిధున్ చక్రవర్తి.