అల్లు అరవింద్ ప్లానింగ్ మాములుగా లేదుగా..? ఆ డైరెక్టర్ తో అల్లు అర్జున్ సినిమా లేనట్టేనా..?

Ads

ఇండస్ట్రీలో ఉన్న టాప్ నిర్మాతల్లో ఒకరు అల్లు అరవింద్. ఎన్నో మంచి సినిమాలని నిర్మించి, తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అల్లు అరవింద్ కొన్ని బాలీవుడ్ సినిమాలను కూడా నిర్మించారు.

అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ లో అల్లు అర్జున్ హీరోగా నటించిన కొన్ని సినిమాలు కూడా రూపొందాయి. అవి ఎంతో పెద్ద విజయాలను కూడా సాధించాయి. వాటిలో సరైనోడు సినిమా ఒకటి. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.

అయితే కొంత కాలం క్రితం అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కలిసి సినిమా చేస్తున్నారు అనే వార్త వచ్చింది. కానీ ఈ వార్త గురించి వివరాలు ఏవీ పెద్దగా బయటికి రాలేదు. అయితే ఇటీవల అల్లు అరవింద్, బోయపాటి శ్రీను కలిసి ఉన్న ఫోటో ఒకటి బయటికి వచ్చింది. “వీళ్ళిద్దరూ ఉన్నారు కానీ అల్లు అర్జున్ ఎక్కడ?”అంటూ కామెంట్స్ వచ్చాయి. అసలు అల్లు అర్జున్ తో బోయపాటి శ్రీను సినిమా ఉందా లేదా అనే క్లారిటీ కూడా ఇప్పటి వరకు లేదు. ఇటీవల అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా ఉంటుంది అన్నట్టు ప్రకటించారు.

Ads

ఇప్పుడు అల్లు అరవింద్ బోయపాటి శ్రీనుతో ఒక సినిమా ఉంటుంది అని ప్రకటించారు కానీ హీరో ఎవరు అనేది చెప్పలేదు. దాంతో సినిమా మీద క్యూరియాసిటీ ఇంకా పెరిగింది. గుంటూరు కారం సినిమా వచ్చిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకటే రకమైన కథలు చేస్తున్నారు అనే ఒక కామెంట్ వినిపిస్తోంది. దాంతో ఇప్పుడు అల్లు అర్జున్ తో చేసే సినిమా కూడా ఇలాంటి కథతోనే ఉంటే కష్టం. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని తప్పించి ఆయన స్థానంలో బోయపాటి శ్రీను సినిమాని చేయబోతున్నట్టు ఒక వార్త అయితే వస్తోంది.

ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్ ప్రకటించిన నెక్స్ట్ సినిమాలో హీరో అల్లు అర్జున్ అని ఒక సమాచారం బలంగా వినిపిస్తోంది.. ఇప్పుడు అల్లు అరవింద్ హీరో పేరు బయట పెట్టకుండా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా వస్తోంది అని చెప్పినా కూడా అందులో హీరో అల్లు అర్జున్ అయ్యుంటారు అని అంటున్నారు. ఏదేమైనా అల్లు అరవింద్ ప్లానింగ్ మాత్రం గట్టిగానే ఉంది. సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాక మళ్ళీ వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు బాగానే నెలకొన్నాయి.

ALSO READ : ఇదేంటి… సలార్ సినిమాలో ఈ హీరోయిన్ ఎక్కడ ఉంది..? ఒక్క సీన్ లో కూడా కనిపించలేదే..?

Previous articleఅతడు మూవీలో ఆ సన్నివేశాన్ని ఆ నవల నుండి కాపీ చేశారని తెలుసా?
Next articleపూరి జగన్నాధ్ సినిమాలలో హీరోలకి ఉండే కామన్ పాయింట్..
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.