Ads
ఈ రోజుల్లో జీన్స్ ప్యాంటు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ వాడుతున్నారు. అయితే ఆ జీన్స్ కి సంబంధించిన చాలా విషయాలు చాలా మందికి తెలియదు అసలు జీన్స్ చరిత్ర ఏమిటి జీన్స్ కి ఏర్పాటు చేసే చిన్న చిన్న పాకెట్లు ఎందుకు ఉంటాయి ఇలాంటి వాటి గురించి తెలుసుకుందాం. మొదట ఫ్రాన్స్ లో నేవి కార్మికులు ఈ జీన్స్ ధరించేవారు ఎందుకంటే ఇది వారి యూనిఫామ్.
మొదటి జీన్స్ నీలం రంగులో తయారు చేశారు ఎందుకంటే వీటిని కార్మికులు హార్డ్ వర్కర్లు ధరించేవారు అలాగే వారి బట్టలు త్వరగా మురికిగా అవుతూ ఉంటాయి కాబట్టి అవి కనిపించకుండా ఉండటం కోసం నీలిరంగు జీన్స్ తయారు చేసేవారు.దానికోసం వారు ఇండిగో డైని ఉపయోగించేవారు. 185 నాటికి జీన్స్ బాగా ప్రాచుర్యం పొందింది.1950లో నటుడు జేమ్స్ డీన్ హాలీవుడ్ చిత్రం రాబుల్ వితౌట్ ఏ కాజ్ సినిమా లో జీన్స్ ని మొట్టమొదటిసారిగా ఉపయోగించాడు.
Ads
అప్పటినుంచి సాధారణ ప్రజలు కూడా ఈ జీన్స్ ని వాడటం ప్రారంభించారు. అయితే జీన్ ప్యాంట్ పై సాధారణంగా నాలుగు పెద్ద ప్యాకెట్స్ ఉంటాయి అందులో కుడివైపున ఒక చిన్న జేబు ఉంటుంది దాన్ని మీరు చూసే ఉంటారు ఇందులో ప్రజలు ఎక్కువగా నానాలను పెట్టుకునేవారు కానీ ఈ జేబు ఎందుకు తయారు చేయబడిందో తెలుసా నిజానికి గడియారం ఉంచడానికి తయారు చేశారు.
ఆ రోజులలో గడియారాలు చేతికి పెట్టుకునే మోడల్ ఆ రోజుల్లో అందుబాటులో ఉండేది కాదు కాబట్టి చేతికి అందుబాటులో ఉంచుకోవడం కోసం ఆ చిన్ని జేబులో గడియారాన్ని ఉంచుకునేవారు. కానీ నేడు రిస్ట్ వాచ్లు అందుబాటులోకి ఒక చిన్నప్పటికి జీన్స్ పై ఉండే ఆ చిన్ని జేబులు అంతరించిపోలేదు. వాటిలో ఇప్పుడు కీ చైన్స్ చిన్నచిన్న నాణాలు పెట్టుకుంటున్నారు