రకుల్ ప్రీత్ పెళ్లి గోవాలో.. ప్రధానిమోదీ చెప్పడం వల్లేనా..?

Ads

రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌గా రాణించిన విషయం తెలిసిందే. మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ లాంటి  స్టార్ హీరోలతో నటించి నెంబర్ వన్ హీరోయిన్‌గా రాణించారు. అయితే ఆ తరువాత ఆమె నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో తెలుగులో ఆఫర్స్ తగ్గిపోయాయి.

ఆ తరువాత బాలీవుడ్‌, కోలీవుడ్ చిత్రాలలో చేసిన సరైన హిట్ పడలేదు. అలా ఆమెకు సినిమాలో ఆఫర్స్  తగ్గిపోయాయి. దాంతో జిమ్ వీడియోలు, ఫొటో షూట్స్ తో నెట్టింట్లో సందడి చేస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా ఆమె పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె పెళ్లి వేడుక మారడానికి కారణం ప్రధాని మోదీ అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ ప్రేమించుకున్న విషయం తెలిసిందే. ఈ జంట ఈ నెలలో వివాహం చేసుకోబోతున్నారు. ఇటీవల వీరి పెళ్లి గోవాలో ఫిబ్రవరి 22న జరగనుందంటూ పలు వార్తలు వచ్చాయి.

Ads

అయితే ఈ జంట ముందుగా డెస్టినేషన్ వెడ్డింగ్ విదేశాల్లో చేసుకోవాలని భావించారట. అయితే ఆఖరి నిమిషంలో వేడుకను భారత్ కు మార్చాలని నిర్ణయించారట.  అయితే పెళ్లి వేడుక మార్చడానికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనే అని వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా దేశంలోని సంపన్న కుటుంబాలు, సినీ సెలెబ్రిటీలు తమ పెళ్ళిళ్ళను విదేశాల్లో చేసుకుంటున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ప్రధాని మోదీ సెలెబ్రిటీలు వేడుకలను విదేశాల్లో కాకుండా ఇండియాలోనే జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు చివరి నిముషంలో రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ జంట తమ పెళ్లి వేడుకను గోవాకు మార్చుకున్నారని వాళ్ల సన్నిహిత వర్గాలు చెప్పినట్లుగా ఒక మీడియా సంస్థ వెల్లడించింది.

Also Read: Ambajipeta Marriage Band Review: “సుహాస్” హీరోగా నటించిన ఈ మూవీ అలరించిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్!

 

Previous articleAmbajipeta Marriage Band Review: “సుహాస్” హీరోగా నటించిన ఈ మూవీ అలరించిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్!
Next articleదేశంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి.. ఎవరిదో తెలుసా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.