Ads
ప్రముఖ హీరో సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా నిన్న విడుదల అయ్యింది. కుల వివక్ష అనే అంశం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఇలాంటి ఒక టాపిక్ మీద చాలా సినిమాలు వచ్చాయి. కానీ డీల్ చేసే విధానాలు వేరేగా ఉండడం వల్ల సినిమాలు కొత్తగా అనిపించాయి.
ఈ సినిమా చూస్తున్నంత సేపు కూడా ఇలాంటి సీన్స్ చాలా చోట్ల చూశాము అనిపిస్తుంది. కానీ సినిమా పోస్టర్స్, ట్రైలర్స్ చూసినప్పుడు సినిమాలో హీరో సుహాస్ అని అనుకుంటాం. కానీ సినిమా చూశాక సుహాస్ తో పాటు సుహాస్ అక్క పద్మగా నటించిన శరణ్య పాత్ర కూడా సమానంగా ఉంది అని అర్థం అవుతుంది.
శరణ్య ప్రదీప్ ఫిదా సినిమాలో సాయి పల్లవి అక్కగా నటించారు. ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. కొన్ని సినిమాల్లో మంచి పాత్రల్లో నటించారు. మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో ముఖ్య పాత్రలో నటించారు. ప్రియమణి నటించిన భామాకలాపంలో కూడా ఒక మంచి పాత్రలో నటించారు. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాతో మరొక మంచి పాత్ర దొరికింది. సినిమా మొత్తం కూడా పద్మ అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది.
Ads
చూస్తున్నంత సేపు కూడా శరణ్య అనే నటి గుర్తు రాకుండా, పద్మ అనే పాత్ర మాత్రమే గుర్తొస్తుంది. తన చుట్టూ జరుగుతున్న పనులకి అడ్డుగా నిలబడి, ఎవరికీ భయపడకుండా ఏది అనుకుంటే అది చెప్పే తత్వం ఉన్న అమ్మాయి పద్మ. తనని ఎంత మంది భయపెడుతున్నా సరే భయపడకుండా ధైర్యంగా వారికి ఎదురు నిలబడుతుంది. తన పాత్ర చివరి వరకు వచ్చేసరికి కూడా ఆత్మాభిమానం వదులుకోదు. తనని ఇబ్బంది పెట్టినా సరే తను నమ్మిన సిద్ధాంతాల మీదే బతుకుతుంది.
అసలు పద్మ లాంటి ఒక మంచి పాత్ర రాయడం అనేది అభినందించాల్సిన విషయం. అలాంటి పాత్రకి న్యాయం చేశారు శరణ్య. సినిమా చూశాక, మిగిలిన నటీనటుల సంగతి పక్కన పెడితే, అందరికంటే ఎక్కువ అభినందనలు మాత్రం శరణ్య పాత్రకి వస్తున్నాయి. శరణ్య ఆ పాత్ర పోషించినందుకు శరణ్యని కూడా అందరూ మెచ్చుకుంటున్నారు. అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అని అంటున్నారు. సినిమాకి తనే రియల్ హీరో అని అన్నారు.
ALSO READ : Kismat Review: సైలెంట్ గా రిలీజ్ అయిన “కిస్మత్” సినిమా ఎలా ఉంది.? స్టోరీ, రివ్యూ & రేటింగ్!!