Ads
సినిమా రంగంలో ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి నుండి మరొక వృత్తికి మారుతూ ఉంటారు. డైరెక్టర్ హీరో అవ్వడం, హీరో డైరెక్టర్ అవ్వడం, లేదా నిర్మాతలు అవ్వడం. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్లకు కొదవలేదు.
అలా ఎంతో మంది కొరియోగ్రాఫర్లు కూడా డైరెక్టర్లుగా మారారు. తమ సినిమాలని రూపొందించి విడుదల చేశారు. మన ఇండస్ట్రీలో డైరెక్టర్లుగా మారి సినిమాలని రూపొందించిన కొరియోగ్రాఫర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 విజయ్ బిన్నీ
కొరియోగ్రాఫర్ విజయ్ మాస్టర్ ఇటీవల నా సామి రంగ సినిమాని రూపొందించారు. నాగార్జున ఈ సినిమాలో హీరోగా నటించి, ఈ సినిమాని నిర్మించి సంక్రాంతికి విడుదల చేశారు.
#2 సుచిత్ర చంద్రబోస్
ప్రముఖ కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ కూడా పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో డైరెక్టర్ గా మారారు.
#3 వీరాస్వామి
ప్రముఖ కొరియోగ్రాఫర్ వీరాస్వామి కూడా డైరెక్టర్ గా మారి ఏప్రిల్ 28 ఏం జరిగింది అనే సినిమాని రూపొందించి విడుదల చేశారు.
#4 రెమో డి సౌజా
ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డి సౌజా కూడా దర్శకుడిగా మారి ఎనీ బడీ కెన్ డాన్స్, రేస్ 3 వంటి సినిమాలని రూపొందించారు.
#5 సన్నీ కొమ్మలపాటి
ఆట ప్రోగ్రాం ద్వారా ఫేమస్ అయిన సన్నీ కూడా మిస్టేక్, ఎస్5:నో ఎగ్జిట్ సినిమాలని రూపొందించారు.
#6 ప్రభుదేవా
గత కొద్ది సంవత్సరాల నుండి ప్రభుదేవా డాన్స్ తో పాటు, దర్శకత్వం, నటన కూడా చేస్తున్నారు. ఇలా ఆల్ రౌండర్ అనిపించుకుంటున్నారు.
Ads
#7 అమ్మ రాజశేఖర్
ప్రముఖ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ కూడా రణం, టక్కరి వంటి సినిమాలను రూపొందించారు.
#8 బృందా
ఎన్నో సినిమాలకు కొరియోగ్రఫీ చేసిన బృందా మాస్టర్ దుల్కర్ సల్మాన్, కాజల్, అదితి రావు హైదరి హీరో హీరోయిన్లుగా చేసిన హే సినామిక అనే సినిమాని రూపొందించారు. ఆ తర్వాత కోనసీమ థగ్స్ అనే సినిమాకి కూడా దర్శకత్వం వహించారు.
#9 రాబర్ట్
ఈటీవీలో వచ్చిన ఢీ ప్రోగ్రాం ద్వారా ఫేమస్ అయిన రాబర్ట్ మాస్టర్ ఎంజీఆర్ శివాజీ, రజనీ, కమల్ అనే సినిమాకి దర్శకత్వం వహించారు.
#10 రాఘవ లారెన్స్
రాఘవ లారెన్స్ మాస్టర్ కూడా ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎన్నో సినిమాల్లో నటించారు.
#11 విద్యాసాగర్ రాజు
కొరియోగ్రాఫర్ విద్యాసాగర్ రాజు రచయిత, ఎఫ్ కుక్ (ఫాదర్, చిట్టి, ఉమా, కార్తీక్) సినిమాలకి దర్శకత్వం వహించారు.
#12 రాజు సుందరం
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం మాస్టర్ కూడా అజిత్ హీరోగా నటించిన ఏగన్ అనే సినిమాకి దర్శకత్వం వహించారు.
#13 అజయ్ సాయి మణికందన్
ప్రముఖ కొరియోగ్రాఫర్ అజయ్ సాయి మణికందన్ మథనం అనే సినిమాకి దర్శకత్వం.
వీరు మాత్రమే కాదు. ఇంకా ఎంతో మంది కొరియోగ్రాఫర్లు డైరెక్టర్లుగా మారి సినిమాలు చేశారు.
ALSO READ : అసలు ఎవరు ఈ ముఖేష్ గౌడ..? ఎందుకు అతనికి ఇంత ఫ్యాన్ బేస్ ఉంది..?