Ads
1990 దశకం లో గ్రామదేవతల సినిమాలు, అందులోను గ్రాఫిక్స్ కథలు బాగా నడుస్తూ ఉండేవి. అందులోని కోతి, పాము వంటి జంతువులు ఉంటే సినిమాకి అదనపు అట్రాక్షన్. అలాంటి గ్రాఫిక్స్ తో వచ్చిన సినిమాలలో ఆడివెళ్ళి ఒకటి. సీత ప్రధానపాత్ర పోషించగా దివంగత దర్శకుడు రామనారాయణణ్ అద్భుత సృష్టి ఈ సినిమా. ఆ రోజులలో ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
అయితే ఈ సినిమాని ఇప్పుడు రీమేక్ చేయాలని చూస్తున్నారు నిర్మాత మురళి.ఈయన మరెవరో కాదు ఆడివెళ్లి సినిమా దర్శకుడు రామనారాయణణ్ కుమారుడు మరియు నిర్మాత. ఈ మధ్యనే ఆయన ఈ సినిమా గురించి మాట్లాడారు.
చిత్ర నిర్మాణ సమయంలో తనకు తొమ్మిది సంవత్సరాలని, తండ్రి వెంట షూటింగ్ కి వెళ్లిన విషయం ఇప్పటికీ తనకి గుర్తుందని చెప్పుకొచ్చారు మురళి. గ్రామీణ నేపథ్యంలో రూపొందించిన చిత్రం కావడంతో అప్పట్లోనే అది ఘన విజయాన్ని సాధించింది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ప్రారంభ దశలోనే తన తండ్రి దాన్ని బాగా వాడుకున్నారని చెప్పుకొచ్చారు.
Ads
ఈ సినిమాని 90 రోజులలో పూర్తి చేశారని,ఈ చిత్రంలో పాటలు ఇప్పటికీ ఉత్సవాల్లో మారుమ్రోగిపోతుంటాయని చెప్పుకొచ్చారు మురళి. జంతువుల ప్రాముఖ్యం కలిగి ఉన్న ఈ సినిమాని రీమిక్స్ చేయడం కష్టమే కానీ రీమేక్ చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపారు మురళి. అప్పట్లో ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర సీత పోషించింది. ఇప్పుడు నయనతార నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉన్నది అన్నది మనకి ఇంకా తెలియదు. ఈ సినిమా కోసం నటీనటులను ఇంకా ఎంపిక చేయలేదు అన్నది సమాచారం. ఏది ఏమైనాప్పటికీ సీత పాత్రలో నయనతార బాగా సూట్ అవుతుంది అన్నది ప్రేక్షకుల అభిప్రాయం. త్వరలోనే చిత్ర వివరాలను వెల్లడిస్తామని నిర్మాత మురళి పేర్కొన్నారు కాగా ఈ సినిమా శ్రావణ శుక్రవారం పేరుతో తెలుగులోకి కూడా అనువాదం అయ్యి సూపర్ హిట్ సాధించటం విశేషం.