Ads
దేశంలో బియ్యం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా సన్న బియ్యం క్వింటాల్‌కు బహిరంగ మార్కెట్‌లో 1,000 నుండి 1,500 రూపాయలకు వరకూ పెరిగి సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి ఏర్పడుతోంది.
Ads
సన్న బియ్యం ధరల పెరుగుదల నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరకే నాణ్యత కలిగిన సన్న బియ్యాన్ని ‘భారత్ రైస్’ పేరుతో విక్రయించాలని నిర్ణయించింది. ఈ రైస్ అమ్మకాలను ఇప్పటికే మొదలుపెట్టింది. అయితే హైదరాబాద్‌లో భారత్ రైస్ ఎక్కడ విక్రయిస్తారో ఇప్పుడు చూద్దాం..
భారత్ రైస్ ను ఎన్ఏఎఫ్ఈడీ, ఎన్‌సిసిఎఫ్, కేంద్రీయ భండార్ రిటైల్ సెంటర్లతో పాటు మొబైల్ ఔట్‌లెట్లలో కూడా విక్రయిస్తున్నారు. ఈ రైస్ 5 కేజీ, 10 కేజీల బ్యాగుల్లో దొరుకుతున్నాయి. మొదటి స్టేజ్ లో రిటైల్ మార్కెట్లో 5 లక్షల టన్నుల రైస్ ను విక్రయిస్తామని కేంద్రం వెల్లడించింది. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం కేజీ సన్న బియ్యం ధర 60-70 రూపాయలు ఉంది. అయితే భారత్ రైస్‌ను 29 రూపాయలకే విక్రయిస్తున్నారు. ధర అందుబాటులో ఉండడంతో సామాన్యులు ఈ రైస్ కోసం పోటీపడుతున్నారు.
హైదరాబాద్‌లో ఈ రైస్ కేంద్రాలు ఎక్కుడున్నాయని అంతా ఆరా తీస్తున్నారు. గన్‌పార్క్ దగ్గరలో ఉన్న ఎన్ఏఎఫ్ఈడీ, కోఠిలోని కేంద్రీయ భండార్, సుల్తాన్ బజార్‌లో ఎన్‌సిసిఎఫ్ సెంటర్లలో భారత్ రైస్‌ను విక్రయిస్తారు. మొబైల్ ఔట్‌లెట్స్ సైతం త్వరలో ప్రారంభిస్తారు. అంతేకాకుండా త్వరలో ఆమెజాన్, జియోమార్ట్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ-కామర్స్ సైట్లలో కూడా భారత్ రైస్ ను విక్రయించనున్నట్టు తెలుస్తోంది.
కేంద్రం గతేడాది నవంబర్‌లో ‘భారత్ ఆటా ‘ బ్రాండ్ పేరుతో సబ్సిడీ రేటుతో గోధుమ పిండి విక్రయాన్ని లాంఛనంగా ప్రారంభించింది. ఇది దేశవ్యాప్తంగా విస్తరించి సహకార సంఘలు అయిన ఎన్ఏఎఫ్ఈడీ, ఎన్‌సిసిఎఫ్, కేంద్రీయ భండార్ రిటైల్ సెంటర్లలో లబిస్తున్నాయి. వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్రం గోధుమపిండి కిలో రూ.27.50 పాటు, భారత్ దాల్ శనగ పప్పును కిలోకు రూ.60, ఉల్లిని రూ.25కి కేంద్రీయ భండార్, నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్ ద్వారా అందజేస్తోంది.
Also Read: స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేసేవారికి జీహెచ్ ఎంసీ కొత్త రూల్స్.. ఏమిటంటే..?