ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ హీరో పేరే వినిపిస్తోంది..! ఇతను ఎవరో తెలుసా..?

Ads

కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ, గుర్తింపు తెచ్చుకుంటూ, పాపులర్ అయిన హీరోలు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. ఆలాంటి వారిలో కోలీవుడ్ హీరో మణికందన్ కూడా ఒకరు. ప్రస్తుతం కోలీవుడ్ లో అతని పేరు ట్రెండింగ్ లో ఉంది.

ఒక వైపు సినిమాలు, మరో వైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ మణికందన్ క్రేజ్ పెంచుకుంటున్నాడు. ఇప్పుడు మణికందన్ హీరోగా నటించిన ఒక సినిమాను తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ఇంతగా పాపులర్ అయిన మణికందన్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
గత ఏడాది గురక కాన్సెప్ట్ తో రిలీజ్ అయిన గుడ్ నైట్ మూవీ హీరోనే మణికందన్. ఆ మూవీ కోలీవుడ్ లో సూయపర హిట్ గా నిలిచింది. ఈ మూవీతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. ఓటీటీలో తెలుగు వెర్షన్ లో స్ట్రీమింగ్ అయ్యింది. దాంతో ఈ మూవీకి తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. మణికందన్ నటన అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు.
మణికందన్ 2013లో పిజ్జా II-విల్లాతో రచయితగా కోలీవుడ్ లో అడుగుపెట్టాడు. 2015లో ఇండియా పాకిస్తాన్ మూవీతో నటుడుగా మారాడు. పలు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు. ఆ తరువాత 8 తొట్టక్కల్ మూవీలో విలన్ గా నటించారు. 2017 వచ్చిన సూపర్ హిట్ మూవీ విక్రమ్ వేదకి డైలాగ్స్ రాయడమే కాకుండా ఈ చిత్రంలో పోలీస్ కానిస్టేబుల్ పాత్రను పోషించాడు. మణికందన్ డైలాగ్ రైటర్‌గా శివ, జీతు జోసెఫ్ సినిమాలకు పనిచేశారు. 2019లో సిల్లు కారుపట్టిలో నివేదిత సతీష్‌తో జతకట్టాడు.
2021 లో ఏలే చిత్రంలో మణికందన్ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.జై భీమ్ లోనూ నటించి, ప్రశంసలు పొందాడు. గత ఏడాది గుడ్ నైట్ మూవీలో హీరోగా నటించి, సంచలన విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం మణికందన్ సినిమాలకు డిమాండ్ ఏర్పడింది. దాంతో త్వరలో రిలీజ్ కాబోతున్న అతని మూవీ ట్రూ లవర్ ను మారుతి, ఎస్ కే ఎన్ తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ యూత్ ని ఆకట్టుకుంటోంది.

Ads

Also Read: “లాల్ సలామ్” తెలుగు ట్రైలర్ లో “రజినీకాంత్” కి మనో బదులు ఆ హీరో డబ్బింగ్..! అసలు సెట్ అవ్వలేదు కదా..?

Previous articleఅంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాలో శరణ్య చేసిన ఈ సీన్ డిలీట్ చేశారా..? కారణం ఏంటంటే..?
Next articleబుల్లితెర నుండి సినీ ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన 5 గురు హీరోయిన్లు..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.