Ads
సినిమా ఇండస్ట్రీ లో నెగ్గుకు రావాలి అంటే..ప్రతిభతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాల్సిందే. ఎంతో ప్రతిభతో, వారి స్వయం కృషి తో హీరోలు కానీ, డైరెక్టర్ లు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుంటారు. అయితే కొన్ని హిట్ లు రాగానే సరైన కథలు ఎంచుకోకుండా సినిమాలు తీస్తూ ఉంటారు.
అసలు అన్యాయం వైపు ఉన్న వ్యక్తుల్ని హీరోలుగా.. వాటిని అడ్డుకున్న వారిని విలన్లుగా చూపించటం ఇప్పటి సినిమాల్లో జరుగుతుంది. అది చూసి ప్రేక్షకులు వారిని అనుకరించటం వంటివి చేయడం మొదలు పెడితే అది చాలా పెద్ద సమస్యగా మారుతుంది. ఇది చాలా మంది హీరోలు, దర్శకులు గుర్తించట్లేదు.
ఒకవైపు అద్భుత చిత్రాలతో తెలుగు చిత్రసీమ ఖ్యాతి ఖండాంతరాలు దాటుతుంటే మరో వైపు ఇటువంటి చిత్రాలు దాన్ని తగ్గిస్తున్నాయి. వాటిలో చాలా వరకు హిట్ టాక్ తెచ్చుకున్నవే..అలాంటి కొన్ని సినిమాలేంటో చూద్దాం.
#1 ఇడియట్
అమ్మాయి మనోభావాలతో సంబంధం లేకుండా కౌగిలించుకో, ముద్దుపెట్టు అని హీరో హీరోయిన్ ను వేధిస్తుంటే అదే ట్రెండ్ అని యూత్ ఫాలో అయిపోతున్నారు.
#2 పోకిరి
ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇది మన యూత్ మీద ఎంతో ప్రభావం చూపించింది .. కృష్ణ మనోహర్ ని చూసి నేర్చుకుందామని ఒకడు కూడా అనుకోడు .. కానీ పండు గాడ్ని చూసి మాత్రం చాలా విధాలుగా చెడిపోయారు యూత్.
#3 చిత్రం
దర్శకుడు ఒక మెసేజ్ ఇద్దామని ట్రై చేస్తే అది చాలా ఎబ్బెట్టుగా మారింది.
#4 ఖతర్నాక్
మనకి విద్య చెప్పే గురువుల్ని గౌరవించేలా రేపటి తరానికి నేర్పించాలి కానీ ఈ సినిమా లో దానికి పూర్తి వ్యతిరేకం గా చూపించారు.
Ads
#5 అర్జున్ రెడ్డి
ఈ సినిమా రిలీజ్ అయినపుడు చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ ఇందులో హీరో పాత్ర కానీ, హీరోయిన్ తో ప్రవర్తించే విధానం కానీ సరిగా ఉండవు.
#6 నేను లోకల్
ఒక అమ్మాయిని నిజం గా ప్రేమించిన వ్యక్తి తన తండ్రి మాట మేరకు జీవితం లో స్థిర పడ్డాకే వస్తాను అని చెప్పి వెళ్తాడు. అతడు ఈ సినిమాలో విలన్. కానీ ఆ అమ్మాయిని నిత్యం వేధిస్తూ.. ఆమె తండ్రిని కించపరుస్తూ..సరైన చదువు, ఉద్యోగం లేకుండా ఉన్న వాడు హీరో. కానీ ఈ చిత్రం హిట్ అయింది.
#7 హార్ట్ ఎటాక్
ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఎప్పటికి నీతోనే ఉంటాను అని చెప్పకుండా..హీరో నీ నుంచి ఒక్క ముద్దు ఇస్తే చాలు.. ఇంకేం వద్దు అని చెప్తాడు..ఇదే హీరోయిజం ఈ సినిమాలో.
#8 ఆర్ ఎక్స్ 100
అసలు హీరోని చూసి నచ్చడంతో తన కోసం హీరోయిన్ చేసే దుర్మార్గాలు అన్ని ఈ చిత్రం లో చూపించారు. దీన్ని ప్రేక్షకులు ఏ విధం గా తీసుకున్నారు అన్నది వేరే విషయం.
#9 ఉప్పెన
సరిగా జీవితం అంటే ఏంటో తెలియని ఒక అమ్మాయి.. ఒక పేద వ్యక్తి దగ్గర దొరికిన స్వేచ్చని ప్రేమ అనుకుంటుంది. దాని కోసం ఎన్ని ఆటంకాలు ఎదురైనా అతనితోనే ఉండేందుకు సిద్ధపడుతుంది.
#10 పుష్ప
ఈ చిత్రం లో ఒక నేరస్తుడే హీరో. అతన్ని అడ్డుకొనే పోలీసులు విలన్లు. ఆ హీరో మ్యానరిజాల్ని అనుకరిస్తూ అభిమానిస్తున్నారు ప్రేక్షకులు.