Ads
రజనీకాంత్ ఈ పేరు వింటేనే భాషతో సంబంధం లేకుండా అందరూ అభిమానిస్తారు. దేశ విదేశాలలో సైతం ఆయనకి అభిమానులు ఉన్నారు. తలైవా పేరు చెప్పుకొని హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి.
ఆయన సిగరెట్ నోట్లో పెట్టుకునే స్టయిల్ కి ఇక్కడ ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తాయి. అలాంటి రజనీకాంత్ తీసుకున్న ఒక డేరింగ్ డెసిషన్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
అదేమిటంటే తన మరణం తర్వాత ఆస్తి మొత్తం ట్రస్ట్ కి చెందాలని వీలునామా రాశాడు. కనీసం ఒక పైసా కూడా ఫ్యామిలీకి చెందకూడదని, తనని సూపర్ స్టార్ ను చేసిన జనాలకు తన సినిమాలు చూసేటందుకు డబ్బులు కేటాయించిన పేద ప్రజలకు చెందాలని గతంలోనే ప్రకటించాడు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక సామాన్య బస్ డ్రైవర్ గా కెరియర్ ని స్టార్ట్ చేసిన రజినీకాంత్ తర్వాత కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడు.
Ads
ఇప్పుడు ఒక సినిమాకి 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంటే అతని స్టార్ డమ్ ఏ విధంగా ఉందో ఊహించవచ్చు. ఇంచుమించు 500 నుంచి 550 కోట్ల వరకు ఆస్తి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే రజనీకాంత్ కి బాహ్య ఆనందం కన్నా అంతర్గత ఆనందానికి ఎక్కువ విలువిస్తారని అతనికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అని అందరికీ తెలిసిన విషయమే. ఆ ఎఫెక్ట్ రజనీకాంత్ ఆస్తి పంపకాల విషయంలో కనిపిస్తుంది. అందుకే ఆస్తి మొత్తానికి సమాజానికి రాసేశారు రజనీకాంత్.
అయితే ఈ విషయం పట్ల కుటుంబ సభ్యులు కూడా సంతృప్తికరంగా ఉన్నట్లు సమాచారం. అవసరానికి మించిన ఆస్తి మనిషిని అధోగతి పాలు చేస్తుందని రజినీకాంత్ చాలా సందర్భాలలో చెప్పేవారు. అయితే అది తనకి కూడా అన్వయించుకొని ఆస్తి మొత్తాన్ని సమాజానికి రాసేయటం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. అందుకే నిజంగా రజినీకాంత్ చాలా గ్రేట్.