Ads
సినిమా ఇండస్ట్రీలో ప్రతి దర్శకుడికి ఒక శైలి ఉంటుంది. ఒకరు కామెడీ సినిమాలు బాగా తీస్తే… ఒకరు యాక్షన్ సినిమాలు బాగా తీస్తారు. ఇంకొక దర్శకుడు లవ్ స్టోరీలను అందంగా తీయగలడు. కానీ దృశ్యం సినిమా తీసిన దర్శకుడు జీతూ జోసెఫ్ మాత్రం సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకున్నాడు. తాజాగా ఆయన తర్కెక్కించిన నెరు చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటి లో స్ట్రీమ్ అవుతూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ మంచి వ్యూస్‌తో దూసుకుపోతుంది.
జీతు జోసఫ్ ది కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని ఎలంజి అనే చిన్న గ్రామం. జీతూ ఇంటర్ చదివితేటప్పుడు తన పెదనాన్న పిల్లలతో కలిసి సినిమాలకి బాగా వెళ్ళేవాడు. సినిమాలో చూస్తూ ఆ సినిమా ఎలా తీస్తారు అంటూ విశ్లేషిస్తూ ఉండేవాడు. తర్వాత క్రమంగా సినిమాలు గురించి తెలుసుకుంటూ వాటి పుస్తకాలు చదువుతూ ఇంటర్ పూర్తి అయ్యేసరికి సినిమా పిచ్చోడు అయిపోయాడు. తండ్రి తో తాను సినిమాల్లోకి వెళ్తానంటే తండ్రి షాక్ అయ్యి … నేను ఇంజనీర్ చేయాలనుకున్నాను…సరే ఏదో ఒక డిగ్రీ పూర్తి చేసి ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పాడు. తర్వాత పూణేలో ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరదామనుకునేటప్పుడు అనారోగ్యం కారణంగా ఆగిపోయాడు.
Ads
తర్వాత జీతూ ప్రేమ కహాని కారణంగా సినిమాలకు దూరంగా ఉండిపోయాడు. తర్వాత తన ఆసక్తిని గమనించిన అతని భార్య లిండా సినిమాల్లోకి వెళ్ళమని ప్రోత్సహించింది. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి మూడేళ్లు ఒక కథ రాసుకుని దిలీప్ హీరోగా చేద్దాము అనుకుంటే చివరి నిమిషంలో నిర్మాతలు హ్యాండ్ ఇచ్చారు. తర్వాత డిటెక్టివ్ కథతో సురేష్ గోపిని కలిశాడు. నిర్మాతలు దొరకపోవడంతో తన తల్లి ప్రోత్సాహంతో తానే నిర్మాతగా మారి డిటెక్టివ్ సినిమాని సూపర్ సూపర్ హిట్ చేశారు. తర్వాత కేరళలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా దృశ్యం సినిమా రూపొందించారు.
దృశ్యం సినిమా తెలుగుతోపాటు అన్ని భాషల్లోనూ తెరకెక్కి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. డిటెక్టివ్ సినిమాతో మొదలైన జీవితం సినిమా ప్రయాణం 17 సినిమాలు తీయగా వాటిలో మూడే ఫ్లాపులు మిగతావన్నీ ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. తాజాగా తరికెక్కించిన నెరు చిత్రం 12 కోట్లతో తీస్తే థియేటర్ శాటిలైట్ హక్కులన్నీ కలుపుకుని 100 కోట్లు వసూలు సాధించింది. ప్రస్తుతం మోహన్ లాల్ హీరోగా రామ్ అనే ఒక యాక్షన్ సినిమాని తెరకెక్కిస్తున్నారు.