Ads
అండర్ 19 ప్రపంచకప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఆదివారం నాడు జరిగిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. అదే ఇద్దరు క్రికెటర్లు తెలుగులో మాట్లాడుకోవడం.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్రికెటర్లు తెలుగులో మాట్లాడిన మాటలు వారి స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యింది. దానిని ప్రముఖ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ తెలుగు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..అండర్ 19 ప్రపంచకప్ లో భారత జట్టు అన్ని మ్యాచులు వరుసగా గెలుస్తూ, ఫైనల్ లో అడుగుపెట్టింది. ఆదివారం నాడు ఫైనల్ లో ఇండియా, ఆస్ట్రేలియాతో తలపడింది. భారత జట్టుకు ఆడుతున్న ఆటగాళ్లు మురుగణ్ అభిషేక్, అరవెల్లి అవనీష్ రావు మ్యాచ్ లో తెలుగులో మాట్లాడుకున్నారు. వీరిద్దరు తెలంగాణకు చెందినవారు. వికెట్ కీపర్ అవనీష్ రావు, స్పిన్ ఆల్‌రౌండర్ అభిషేక్ కు తెలుగులో బౌలింగ్ కు సంబంధించిన సూచనలు చేశాడు.
“సేమ్ బాల్ వేయ్‌రా, బాగుంది. స్వీప్ కొట్టినా ఏం కాదు. రెండే షాట్స్ ఆడుతాడు. ఏం కాదు” అంటూ అవనీష్ తెలుగులో చెప్పగా, అవి స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యింది. వాటిని “ఇద్దరు క్రికెటర్లు గ్రౌండ్ లో తెలుగులో మాట్లాడుతుంటే వినడానికి హాయిగా ఉంటుంది కదూ.!! మరి ఈరోజు U19 ఫైనల్స్ లో అదే జరిగింది. మరి మీరు కూడా చూసేయండి” అంటూ స్టార్ స్పోర్ట్స్ తెలుగు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
విదేశీ గడ్డ పై ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో ఇద్దరు తెలుగు ఆటగాళ్లు మాట్లాడుకుంటుంటే బాగుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించి, విజేతగా నిలిచింది. టోర్నీలో వరుసగా అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించిన యంగ్ టీమిండియా ఫైనల్ లో విఫలమైంది.
Ads
ఇద్దరు క్రికెటర్లు గ్రౌండ్ లో తెలుగులో మాట్లాడుతుంటే వినడానికి హాయిగా ఉంటుంది కదూ.!! 🤩
మరి ఈరోజు U19 ఫైనల్స్ లో అదే జరిగింది 😃
మరి మీరు కూడా చూసేయండి.!!
చూడండి
ICC U19 World Cup Final#INDU19vAUSU19 లైవ్
మీ #StarSportsTelugu & Disney + Hotstar లో#U19WorldCupOnStar pic.twitter.com/UPX0xz7zCd— StarSportsTelugu (@StarSportsTel) February 11, 2024
Also Read: ధోని కూతురు ఏ స్కూల్ లో చదువుతోందో తెలుసా..? ఆమె ఫీజు ఎంత అంటే..?