Ads
ఎమ్మెల్యే లాస్య నందిత ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇవాళ తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. లాస్య నందిత వయసు 36 సంవత్సరాలు. పోలీసులు ఈ విషయం మీద దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం జరిగింది.
దీనికి సంబంధించి ప్రాథమిక నివేదికని డాక్టర్లు విడుదల చేశారు. అందులో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఈ నివేదికలో, “లాస్య నందిత తలకి గాయాలు తగిలాయి. అంతే కాకుండా తై బోన్, రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. ఒక కాలు పూర్తిగా విరిగింది.”
“ఇది మాత్రమే కాకుండా, ఆరు దంతాలు ఊడిపోవడంతో పాటు, శరీరం లోపల ఎముకలు కూడా దెబ్బతిన్నాయి. తలకి చాలా బలమైన దెబ్బ తగలడంతో అక్కడికి అక్కడే చనిపోయారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం ఈ ప్రమాదానికి కారణం” అని ప్రాథమిక నివేదికలో వెల్లడించారు. కానీ మరొక పక్క మాత్రం లాస్య నందిత సీట్ బెల్ట్ పెట్టుకున్నారు అని అంటున్నారు. ఎయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ అయినట్లు ఆర్టీవో అధికారులు చెప్పినట్టు సమాచారం.
Ads
కానీ దీని మీద మాత్రం ఇంకా ఎవరికీ స్పష్టత రావట్లేదు. దర్యాప్తు కొనసాగించి, మిగిలిన విషయాలు అన్నీ తెలుసుకుంటే మాత్రమే అసలు నిజం ఏంటి అనేది తెలుస్తుంది. లాస్య నందిత అంత్యక్రియలు ఇవాళ 5 గంటలకు మారెడ్‌పల్లి లో ఉన్న స్మశాన వాటికలో జరిగాయి. సాయంత్రం 4 గంటలకి లాస్య నందిత ఇంటి నుండి అంతిమయాత్ర అయ్యింది. లాస్య నందిత కుటుంబం అంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. ఎంతో మంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా లాస్య నందితకి నివాళులు అర్పించారు.
రేవంత్ రెడ్డి, కవిత మరి కొంత మంది రాజకీయ ప్రముఖులు లాస్య నందిత ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులని పరామర్శించారు. లాస్య నందితకి వారి నివాళులు తెలిపారు. కొంత కాలం క్రితం కూడా లాస్య నందిత ఒక ప్రమాదం నుండి తప్పించుకున్నారు. లాస్య నందిత తండ్రి సాయన్న గత సంవత్సరం చనిపోయారు. ఆయన పదవిని లాస్య నందితకి ఇచ్చారు. అప్పటి నుండి ఎమ్మెల్యేగా విధులు నిర్వర్తించారు. ప్రాథమిక నివేదికలో ఈ విషయాలని వెల్లడించారు.
ALSO READ : లాస్య నందిత చనిపోయే ముందు ఎక్కడికి వెళ్లారో తెలుసా..? అక్కడ ఏం చేశారంటే..?