Ads
భారతీయ ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలకు శనివారం షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం లోక్ సభలో 543 నియోజకవర్గాలు ఉన్నాయి కానీ భారత ఎన్నికల సంఘం 544 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ప్రకటించింది. అలాగే దేశవ్యాప్తంగా ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతలలో లోక్సభ ఎన్నికల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. జూన్ 4న కోట్ల లెక్కింపు చేపడతారు. 543 నియోజకవర్గాలు ఉంటే 544 స్థానాలకు ఎన్నికలు ఎలా జరుగుతాయి అనే సందేహం చాలా మందికి రావడంతో చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ దీనికి క్లారిటీ ఇచ్చారు.
మణిపూర్ లోని రెండు నియోజకవర్గాలలో ఒక స్థానానికి రెండు దశలలో ఓటింగ్ జరుగుతుందని చెప్పారు. దీంతో ఎన్నికలు నిర్వహించే మొత్తంలోక్సభ స్థానాలు సంఖ్య 544 గా ఆయన పేర్కొన్నారు. మణిపూర్ లో రెండు లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 19, 26 తేదీలలో రెండు దశలలో ఎన్నికలు జరుగుతాయని రాజీవ్ కుమార్ తెలిపారు. ఇన్నర్ మణిపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది.
Ads
ఇందులో హీరోక్, వాంగ్జింగ్ టెన్థా, ఖంగాబోక్, వాబ్గై, కక్చింగ్, హియాంగ్లాం, సుగ్నూ, చందేల్, సైకుల్, కాంగ్పోక్పి, సైతు, హెంగ్లెప్, చురాచంద్పూర్, సైకోట్, సింఘత్ ఉన్నాయి. ఔటర్ మణిపూర్ పరిధిలోని మిగిలిన 13 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి. అవి జిరిబామ్, తెంగ్నౌపాల్, ఫంగ్యార్, ఉఖ్రుల్, చింగై, కరోంగ్, మావో, తడుబి, తామీ, తమెంగ్లాంగ్, నుంగ్బా, తిపైముఖ్, థన్లోన్ ఉన్నాయి.
ఆ రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య జాతి ఘర్షణల వల్ల ప్రజలు చెల్లాచెదురు కావడంతో ఒక లోక్ సభ స్థానానికి రెండు దశలలో ఓటింగ్ నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. అలాగే ఏప్రిల్ ఒకటి వరకు ఓటర్ల జాబితాలో మార్పులకు అవకాశం ఉంటుందని, 85 ఏళ్లు దాటిన వారికి ఓట్ ఫ్రొం హోమ్ అవకాశం ఉంటుందని నేరచరిత్ర ఉన్న అభ్యర్థులు మూడు పేపర్లలో ప్రకటన ఇవ్వాలని చెప్పారు